సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాదిద్దాం
ABN, Publish Date - Oct 26 , 2024 | 11:56 PM
టీడీపీ సభ్యత్వ నమోదులో పులివెందుల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలుపుదాం అని పులి వెందుల నియోజకవర్గ ఇనచార్జ్, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
- నియోజకవర్గ ఇనచార్జ్ బీటెక్ రవి
పులివెందుల టౌన, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ సభ్యత్వ నమోదులో పులివెందుల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలుపుదాం అని పులి వెందుల నియోజకవర్గ ఇనచార్జ్, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ మన నియోజకవర్గంలో 80వేలు సభ్యత్వ నమోదు లక్ష్యం ఉందని, ఆ లక్ష్యాన్ని చేరుకుందామన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పులివెందులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మాట ఇచ్చారని, సభ్యత్వ నమోదు తరువాత అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కావున ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విరివిగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పార్ధసారథిరెడ్డి, టీడీపీ నాయకులు మోహనరెడ్డి, రఘునాథరెడ్డి, సంజీవరెడ్డి, పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 26 , 2024 | 11:56 PM