ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మొక్కలను విరివిగా నాటుదాం

ABN, Publish Date - Aug 30 , 2024 | 11:48 PM

ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించుకుందామని కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ పిలుపునిచ్చారు.

వన మహోత్సవంలో భాగంగా పార్కులో మొక్క నాటుతున్న కలెక్టర్‌ శ్రీధర్‌

వన మహోత్సవంలో కలెక్టర్‌ శ్రీధర్‌ పిలుపు

రాయచోటిటౌన్‌, ఆగస్టు 30: ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించుకుందామని కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్ర న్‌, జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్‌, సబ్‌-డివిజనల్‌ అటవీ శాఖ అధికారి శుభమ్‌, డ్వా మా పీడీ మద్దిలేటి, మున్సిపల్‌ కమిషనర్‌ వాసుబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేశ్‌, ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ కన్వీనర్‌ పి.మదనమోహన్‌రె డ్డిలతో కలిసి రాయచోటి పట్టణ పరిధిలోని మాండవ్య ఎకో పార్క్‌ (నగర వనం)లో సామాజిక వన అటవీ విభాగం ఆధ్వ ర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహో త్సవంలో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 68 వేల మొక్కలు నాటామని, ఎక్కడైతే చెట్లు నాటామో వాటిని అలా వదిలేయకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అత్యంత అటవీ ప్రాంతం ఉన్న జిల్లాల్లో అన్నమయ్య జిల్లా కూడా ఒకటన్నారు. జిల్లాలో సుమారు 36 శాతం భూభాగం అటవీ ప్రాంతంగా ఉందని, జిల్లా ప్రజలంతా ఒక బాధ్యతగా అడవిలోని చెట్లను కాపా డుకోవాలన్నారు. ముఖ్యంగా బఫర్‌ జోన్లు, రోడ్లు పక్కన, పార్కులు, పాఠశాలలు, కళాశాలలు, ఇంటి పరిసరాలలో ఎక్కడ వీలైతే అక్కడ చెట్లను పెంచుకోవాలన్నారు. ఈ సంవత్సరం జిల్లాతో పాటు రాయలసీమలో వర్షాలు చాలా తక్కువ పడ్డాయని, వర్షాలు పడాలన్నా, పంటలు పండాల న్నా చెట్లు ఎంతగానో అవసరమని సూచించారు. నగరవనం లో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత అటవీ శాఖ, మున్సి పల్‌ శాఖలు తీసుకోవాలన్నారు. అలాగే మొక్కలు నాటితే ఉపాధి హామీ పథకం కింద వాటి సంరక్షణకు లేబర్‌ ఖర్చు లు కూడా ఇస్తామని తెలిపారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారందరితో ‘మొక్కలను నాటి సంరక్షిస్తామని, చెట్ల సంపద, వృక్ష సంపదను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్‌ అటవీశాఖ అధికారిణి నాగమహేశ్వరి, సబ్‌-డివిజనల్‌ అటవీ అధికారి శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు, అటవీశాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 11:48 PM

Advertising
Advertising