పల్లె ప్రగతికి పాటుపడదాం
ABN, Publish Date - Dec 13 , 2024 | 11:44 PM
పల్లెప్రగతికి పాటు పడదాం అని ఎంపీడీఓ రామాంజనేయరెడ్డి, ఈఓపీఆర్డీ శారద పిలుపు నిచ్చారు.
పులివెందుల రూరల్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పల్లెప్రగతికి పాటు పడదాం అని ఎంపీడీఓ రామాంజనేయరెడ్డి, ఈఓపీఆర్డీ శారద పిలుపు నిచ్చారు. గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు ముగిశాయి. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సభాభవనంలో ఎంపీడీఓ రా మాంజనేయరెడ్డి, ఈఓపీఆర్డీ శారద ఆధ్వర్యంలో మండలస్థాయి అధికారులు, సర్పంచు లు, సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం, ఏపీఓ, సర్పంచులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Dec 13 , 2024 | 11:44 PM