మహాత్ముని ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి
ABN, Publish Date - Oct 02 , 2024 | 11:33 PM
సమాజంలోని ప్రతి పౌరుడూ మహాత్ముని ఆశయాలను ఆదర్శం గా తీసుకోవాలని పీలేరులోని 11వ అదనపు జిల్లా జడ్జి మహేశ తెలిపారు.
పీలేరు, అక్టోబరు 2: సమాజంలోని ప్రతి పౌరుడూ మహాత్ముని ఆశయాలను ఆదర్శం గా తీసుకోవాలని పీలేరులోని 11వ అదనపు జిల్లా జడ్జి మహేశ తెలిపారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఆయన పీలేరులోని సబ్-జైలును సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలతో మాట్లాడుతూ పరివర్తన కోసం రిమాండు విధిస్తుంటారని, ఆ సమయంలో మహాత్ముని ఆశయాలు, బోధనలను స్మరించుకోవాలని సూచించారు. అనంతరం ఆయన సబ్-జైలు పరిసరాలు, వంటశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఎస్‌ఐ బాలకృష్ణ, న్యాయవాది షౌకత అలీ, తదితరులు పాల్గొన్నారు.
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
మదనపల్లె టౌన, అక్టోబరు 2: సబ్‌జైలులో రిమాండ్ ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వ రనాయక్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం స్థానిక సబ్‌జైలు లో ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహిం చారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ రిమాం డ్‌లో వున్న ఖైదీలలో బెయిల్ పొందేం దుకు మండల న్యాయసేవా సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం ఖైదీలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సబ్‌జైలు సూపరింటెం డెంట్ రామకృష్ణ, పారా లీగల్ సుభద్ర, న్యాయసేవా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Oct 02 , 2024 | 11:33 PM