నిరంతర విద్యుతకు చర్యలు చేపట్టాలి
ABN, Publish Date - Sep 23 , 2024 | 12:26 AM
పెద్దమండ్యం మండలానికి ని రంతర విద్యుత సరఫరాకు చ ర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
పెద్దమండ్యం, సెపెంబరు 22: పెద్దమండ్యం మండలానికి ని రంతర విద్యుత సరఫరాకు చ ర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. రెండేళ్ల క్రితం ముసలికుంట ప్రాంతం లో లోవోల్టేజీ సమస్య తీర్చడా నికి విద్యుత సబ్‌స్టేషన నిర్మిం చారు. దీంతో ముసలికుంట బం డ్రేవు, దిగువపల్లి మందలవారిపల్లి ప్రాంతంలో లోవోల్టేజీ సమస్య తీరింది. ఈ సబ్‌స్టేషన ముసలికుంట ప్రాంతాన్నే కాకుండా మండ లానికి కూడా నిరంతర విద్యుత సరఫరాకు ప్రధాన కేంద్రంగా మార నుంది. పెద్దమండ్యం, కలిచెర్ల, తురకపల్లి సబ్‌స్టేషనలతో పాటు ముసలికుంట సబ్‌స్టేషన నిర్మాణ ంతో సబ్‌స్టేషనల సంఖ్య నాలుగుకు చేరింది. కాగా కలికిరి నుంచి వచ్చే మెయిన సప్లై లైన గుర్రంకొండ మీదుగా పెద్దమండ్యం మండలానికి విద్యుత సరఫరా జరుగుతోం ది. అలాగే ములకలచెరువు మండలం బురకాయలకోట నుంచి మెయిన సప్లై తంబళ్లపల్లి మీదుగా గోపిదిన్నె వరకు విద్యుత సరఫరా జరుగుతోంది. కలికిరి, బురకాయలకోట విద్యుత సరఫరా మెయిన లైన్లులు పెద్దమండ్యం-తంబళ్ళపల్లె సరిహద్దులో ఆగింది. ఈ ప్రాం తంలో రెండు విద్యుత మెయిన సప్లై లైన్లు కలిపే టెక్నికల్ పనులు పూర్తి చేస్తే మండలంలో నిరంతర విద్యుత సరఫరాకు సాధ్యమవు తుందని గతంలో అధికారులు వెల్లడించారు. మండలంలో కలికిరి నుంచి విద్యుత సరఫరా అంతరాయం కలిగినపుడు బురకాయలకోట నుంచి, బురకా యలకోట నుంచి విద్యుత అంతరాయం కలిగినప్పు డు కలికిరి నుంచి విద్యుత సరఫరా జరుగుతోందని తెలిపారు. ట్రాన్సకో ఉన్నతాధాకారులు ఈ కార్యాచరణకు రూపుదాలిస్తే కరువు మండలమైన పెద్దమండ్యంకు నిరంతరం విద్యుత సరఫరాతో భూము లు సస్యశ్యామలమై ప్రజల జీవితాలలో వెలుగులు నిండుకుంటాయి. ట్రాన్సకో ఆధికారులు ఆ దిశగా చర్యలు తీసుకొని నిరంతర విద్యుత సరఫరాకు కృషి చేయా లని మండల ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Sep 23 , 2024 | 12:26 AM