ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి

ABN, Publish Date - Nov 27 , 2024 | 11:17 PM

ప్రస్తుతం జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

గూడరేవుపల్లెలో స్థల పరిశీలన చేస్తున్న ఎమ్మెల్యే, అధికారులు

అర్హులకు త్వరలోనే మూడు సెంట్ల స్థలం

ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి

పీలేరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై బుధవారం ఆయన పార్టీ శ్రేణులతో స్థానిక పార్టీ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి గతంలో రూ.2 లక్షల ప్రమాద బీమా సదుపాయం ఉండేదని, దాన్ని ప్రస్తుతం రూ.5 లక్షలకు పెంచారన్నారు. కేవలం రూ.100లు చెల్లించి రెండేళ్లపాటు బీమా సదుపాయం పొందవచ్చన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభ్యత్వ నమోదులో పీలేరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండేదని, ఆ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. 70 వేలకు తగ్గకుండా సభ్యత్వం చేయించాలన్నారు. పీలేరు పట్టణంలోని పేదల కోసం త్వరలోనే మూడు సెంట్ల స్థలం కేటాయించనున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం ఆయన కాలనీల నిర్మాణానికి అనువైన స్థలాల కోసం గూడరేవుపల్లె, దొడ్డిపల్లె పంచాయతీల్లో రెవెన్యూ అధికారులతో పర్యటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వారణాశి శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథరెడ్డి, కోటపల్లె బాబురెడ్డి, మల్లెల రెడ్డిబాషా, పురం రామ్మూర్తి, పోలిశెట్టి సురేంద్ర, ఆతిఖా షఫీ, కోటపల్లె శ్రీనాథరెడ్డి పాల్గొన్నారు.

కలకడ: మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిలు బుధవారం మండలంలో పర్యటించి అనుచరుల యోగక్షేమాలను తెలుసుకున్నారు. మొదట మాజీ సీఎం పాపిరెడ్డిగారిపల్లెలో సీనియర్‌ నాయకుడు వంగిమళ్ల రాజారెడ్డి ఇంటికి వెళ్లి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అనంతరం అన్నదమ్ములిద్దరూ కలిసి మండలంలోని పలు శుభకార్యాలకు వెళ్లడంతో పాటు పలువురిని కలిసి పరామర్శించారు. వీరి వెంట కూటమి నాయకులు నిఖిలే్‌షరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, శ్రీనివాసులరెడ్డి, బివిస్వామి, రెడ్డెప్పరెడ్డి, పుష్పాహాస్‌, బసినాయుడు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2024 | 11:17 PM