అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం
ABN, Publish Date - Nov 01 , 2024 | 11:26 PM
మండ లంలోని పొన్నేటిపాళెం, కురవంక, అంకిశెట్టిపల్లె గ్రా మ పంచాయతీల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మె ల్యే షాజహానబాషా శుక్రవారం శ్రీకారం చుట్టారు.
మదనపల్లె టౌన, నవంబరు 1(ఆంఽధ్రజ్యోతి): మండ లంలోని పొన్నేటిపాళెం, కురవంక, అంకిశెట్టిపల్లె గ్రా మ పంచాయతీల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మె ల్యే షాజహానబాషా శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయు డు దృష్టికి తీసుకెళ్లి అత్యధికంగా పల్లెపండుగ కార్యక్ర మానికి రూ.8 కోట్ల నిధులు మంజూరు చేసుకున్నా మన్నారు. కాంట్రాక్టర్లతో పనిలేకుండా ఆయా గ్రామ ప్రజలే సమష్టిగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నామన్నారు. సీసీ రోడ్లను నాణ్యతగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ ఏఈని ఆదేశించారు. కురవంక సర్పంచ చిప్పిలి చల పతి, ఇనచార్జి ఎంపీడీవో మస్తానవలి, పంచాయతీ కార్యదర్శి షబీనా, వీఆర్‌వో శేఖర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పనసమాకులపల్లె, కుర వంక, రామిరెడ్డిగారిపల్లె, రవీంద్రనగర్, సిద్దమ్మ లే అవుట్, టీచర్స్‌కాలనిలో లబ్దిదారులకు సామాజిక పిం ఛన్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రైవేటు ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న దివ్యాంగుడు మహ బూబ్‌బాషాను స్వయంగా కలసి ఎమ్మెల్యే పింఛన అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు నాగ రాజు, ఎంపీటీసీ హారిక, టీడీపీ నాయకులు వేణు, రెడ్డిప్రసాద్, గురునాథ్, జీవీ నాయుడు, మధు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 01 , 2024 | 11:26 PM