ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వంక ఆక్రమణలపై ఎమ్మెల్యే ఆగ్రహం

ABN, Publish Date - Sep 26 , 2024 | 11:50 PM

మదనపల్లె మండలం సీటీఎం క్రాస్‌రోడ్డు పంచాయతిలో వంకను ఆక్రమించుకుని కట్టిన నిర్మాణాలు, ప్రభుత్వ భవనాన్ని ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చిన అంశంపై ఎమ్మెల్యే షాజహానబాషా ఫైర్‌ అయ్యారు.

చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు

మదనపల్లె టౌన, సెప్టెంబరు 26: మదనపల్లె మండలం సీటీఎం క్రాస్‌రోడ్డు పంచాయతిలో వంకను ఆక్రమించుకుని కట్టిన నిర్మాణాలు, ప్రభుత్వ భవనాన్ని ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చిన అంశంపై ఎమ్మెల్యే షాజహానబాషా ఫైర్‌ అయ్యారు. గురువారం సీటీఎం క్రాస్‌ రోడ్డు పంచా యతీలో ప్రజాదర్బార్‌ నిర్వహించేందుకు ఎమ్మెల్యే షాజహానబాషా హాజ రయ్యారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులో ఆయన క్రాస్‌రోడ్డుకు వచ్చి అక్కడ ఉన్న ప్రభుత్వ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో గ్రంథాలయం నిర్మాణం చేప ట్టారని, కాని ఈ గదికి షట్టర్‌ డోరు బిగించి ఉండటాన్ని గమనించామ న్నారు. ఈ గదిని అద్దెకు తీసుకున్న (కార్పెంటర్‌)వ్యక్తికి ఫోన చేసిన ఎమ్మెల్యే పలు విషయాలను రాబట్టారు. స్థానిక వైసీపీ నాయకుడు, ప్రజాప్రతినిధి భర్త తమకు ఈ గదిని నెలకు రూ.5వేలకు అద్దెకు ఇచ్చా రని, రూ.30వేలు అడ్వాన్సు ఇచ్చానని చెప్పాడు. ఆయనతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడుతూ ప్రభుత్వం భవనాన్ని అద్దెకు తీసుకోవడం తప్పని, వెంటనే ఆ గదిని ఖాళీ చేయాలని సూచించారు. దీంతో పాటు ఈ గదికి ప్రైవేటు వ్యక్తి పేరుతో విద్యుత మీటర్‌ మంజూరు చేశారని, వెంటనే ఈ మీటర్‌ కనెక్షన తొలగించాలని ట్రాన్సకో ఏఈ రమేశను ఆదేశించారు. ఇదే ప్రాంతంలో వంకను ఆక్రమించుకుని ఓ వ్యక్తి షాపులు నిర్మించాడన్న ఫిర్యాదుపై ఎమ్మెల్యే విచారించారు. ఎలాంటి ప్లాన అప్రూవల్‌ లేకుండా భవన నిర్మాణాలు చేస్తుంటే పంచాయతీ కార్యదర్శి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. వంక ఆక్రమణపై వీఆర్‌వో విచారించి ఆక్రమణలను తొల గించాలని ఆదేశించారు. ఆక్రమణలకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగుల పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. క్రాస్‌రోడ్డు సమీ పంలో శ్మశానవాటికను, కొత్తవారిపల్లె పంచాయతీ పరిధిలోని చెరువును ఆక్రమించారని బీజేపీ నాయకుడు కిరణ్‌ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అలాగే సీటీఎం పంచాయతీలోని ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన భూములను మాజీ ప్రజాప్రతినిధి అన్యాక్రాంతం చేశారని గురుప్రసాద్‌ అనే వ్యక్తి ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. వాటితో పాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అర్జీలకు స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఖాజాభి, పీఆర్‌ ఏఈ పీవీ రమణ, టీడీపీ నాయకులు రెడ్డిరామ్‌ప్రసాద్‌, చల్లా నరసింహులు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2024 | 11:50 PM