భూ సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు
ABN, Publish Date - Sep 09 , 2024 | 11:40 PM
మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో నిర్వ హించిన గ్రీవెన్సడేలో భూ సమ స్యలపైనే అధికంగా ఫిర్యాదులు వచ్చాయి.
మదనపట్లె టౌన, సెప్టెంబరు 9: మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో నిర్వ హించిన గ్రీవెన్సడేలో భూ సమ స్యలపైనే అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. సోమవారం సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్య క్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా డివిజనలోని 11 మండలాల నుంచి 53 మంది సబ్‌కలెక్టర్‌కు అర్జీ లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి అర్జీని చదవడంతో పాటు, అర్జీదారుని సమస్య ను సావధానంగా విన్న సబ్‌కలెక్టర్ సంబంధిత మండలాల అధికారులతో మాట్లాడి సమస్యలపై విచారించాలన్నారు. అర్జీలను, ఫిర్యాదులను నిర్దేశిత సమయంలో పరిష్కరిం చాలని సబ్‌కలెక్టర్ సూచించారు. ఎక్కువగా టెన వన అడంగల్, డిజిటల్ కీ సమస్యలు, భూ భాగ పరిష్కార సమస్యలు, హౌసింగ్ పథకాలు, పింఛన్ల కోసం అర్జీలు వచ్చాయి. విశాఖపట్నం స్టీలు ప్లాంటును ప్రైవేటు పరం చేయవద్దని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు సీవీ రమణ, నారాయణ సబ్‌కలెక్టర్‌కు అర్జీ అందజేశారు.
Updated Date - Sep 09 , 2024 | 11:40 PM