పరిహారం అందేవరకు ఎనహెచ పనులు ఆపాలి
ABN, Publish Date - Sep 14 , 2024 | 11:32 PM
నష్టపరిహారం అందే వరకు జాతీయ రహదారి(ఎనహెచ) చేపట్టరాదని భూబాధితులు డిమాండ్ చేశారు.
మదనపల్లె అర్బన, సెప్టెంబరు 14: నష్టపరిహారం అందే వరకు జాతీయ రహదారి(ఎనహెచ) చేపట్టరాదని భూబాధితులు డిమాండ్ చేశారు. ఆ మేరకు శనివారం మదనపల్లె మండ లం తట్టివారిపల్లె బైపాస్ వద్ద ఎన హెచ రోడ్డు పనులు మొదలు పెట్టడంతో భూబాధితులు వాటిని అడ్డుకుని ఽరాస్తారో కో చేశారు. 15 ఇళ్లకు ప్రభుత్వం నుంచి పరిహారం ఏమి రాలేదని, అథికారులు వచ్చి మాతో సంప్రదించి, మాకు నష్ట పరిహారం అందేవరకు రోడ్డు పనులు నిర్వహించారాదని బాధితులు రోడ్డుపై ధర్నా చేశారు. ఉదయాన్నే రోడ్డు పనులంటూ మురుగునీటి పైపులు, తాగునీటి పైపులు, కరెంటు వైర్లులాగేయడంతో ఉద్యోగులు, చిన్న పిల్లలు కరెంటు లేక ఇబ్బందులు పడ్డారు. చెట్టు నరకడం, పైపులు తొలగించడం ఆపాలని వారు కోరారు. అనంతరం ఎనహెచ అధికారి వెంకటేష్‌తో వాగ్వాదానికి దిగ్గారు. పనులు ఆపేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎనహెచ అధికార సర్ధి చెప్పడంతో ఆందోళన సర్దుమణిగింది. ఈ కార్యక్రమంలో భూబాధితులు సాలమ్మ, ఉమా, శివాజమ్మ, నేత్ర, చంద్ర, కమలమ్మ, మహేష్, ఇందిరమ్మ, ప్రణిత, వెంకటరెడ్డి, మోహనరెడ్డి, చంద్రమ్మ, సుబ్రహ్మణ్యం, రామ కృష్ణ, సత్యనారాయణ, వసంత, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Sep 14 , 2024 | 11:32 PM