Kadapa: రాఘవ రెడ్డి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి..
ABN, Publish Date - Dec 11 , 2024 | 11:00 AM
Andhrapradesh: గత మూడు రోజులుగా రాఘవరెడ్డి విచారణ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అసభ్య కర పోస్టులు వ్యవహారంలో వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం మేరకు రాఘవరెడ్డిపైకేసు నమోదు అయ్యింది. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కడప, డిసెంబర్ 11: వైసీపీ సోషల్ మీడియా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి మూడవ రోజు విచారణకు హాజరయ్యారు. కడపసైబర్ క్రైమ్ పోలిస్టేషన్‌లో రాఘవరెడ్డి విచారణ కొనసాగుతోంది. గత మూడు రోజులుగా రాఘవరెడ్డి విచారణ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అసభ్య కర పోస్టులు వ్యవహారంలో వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం మేరకు రాఘవరెడ్డిపైకేసు నమోదు అయ్యింది. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
CM Revanth Reddy: రాజస్థాన్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
రాఘవ రెడ్డి వాంగ్మూలంలో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. వర్రా రవీంద్ర రెడ్డి ఎవరో తెలియదు అంటూ పోలీసులకు రాఘవరెడ్డి సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. రాఘవరెడ్డి వాంగ్మూలం మేరకు ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో మరిన్ని అరెస్ట్‌లు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా తొలిరోజు దాదాపు 10 గంటల పాటు రాఘవరెడ్డిని పోలీసులు విచారించారు. రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగించిన పోలీసులు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి రాఘవరెడ్డిని పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అయితే రాఘవరెడ్డి విచారణ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు.
కాగా... సోషల్ మీడియాలో పోస్టుల వ్యహారంలో అరెస్ట్ అయిన వర్రారవీంద్రారెడ్డి విచారణలో భాగంగా అవినాష్ పీఏ రాఘరరెడ్డి పేరు చెప్పారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీస్ నుంచి కంటెంట్ అంతా రాఘవరెడ్డి వాట్సప్ నుంచి వచ్చిందని వర్రా వాంగ్మూలం ఇచ్చారు. రాఘవరెడ్డి చెప్పిన ప్రకారం వైఎస్ షర్మిల, సునీత, విజయమ్మపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టామని.. అలాగే సీఎం చంద్రబాబు, పవన్‌పై కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేసినట్లు వర్రా రవీంద్రారెడ్డి విచారణలో తెలిపారు. దీంతో రఘవరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన కోసం నెల రోజులుగా గాలిస్తున్నారు. ఈనెల 12 వరకు అరెస్ట్ చేయకుండా హైకోర్టు నుంచి రాఘవరెడ్డి స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో పులివెందులకు వచ్చిన రాఘవరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఈనెల 9 (సోమవారం)న తొలిరోజు విచారణకు రాఘవరెడ్డి హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
జగన్ నిర్వాకం.. అమరావతిపై భారం..
టాప్ 5లో.. ‘యే పవన్ నహీ ఆంధీ హై’
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 11 , 2024 | 11:06 AM