నేత్రపర్వం.. వాసవీ అమ్మవారి పుష్ప యాగం
ABN, Publish Date - May 26 , 2024 | 11:48 PM
వాసవీ కన్యకా పరమేశ్వరి జయం త్యుత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం పీలేరులో అమ్మవారి పుష్ప యాగం నేత్రపర్వంగా జరిగింది.
పీలేరు, మే 26: వాసవీ కన్యకా పరమేశ్వరి జయం త్యుత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం పీలేరులో అమ్మవారి పుష్ప యాగం నేత్రపర్వంగా జరిగింది. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన పుష్ప యాగానికి నెహ్రూ బజారు ఆల యంలోని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఊరేగింపుగా ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి చేర్చారు. అక్కడ సుమారు 200 కిలోల వివిధ పుష్పాలతో అమ్మవారికి పుష్ప యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ గ్రేటర్, వాసవీ కపుల్స్, ఆర్యవైశ్య సంఘం, వాసవీ మహిళా మండలి సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
వైభవంగా శ్రీనివాసుడి
ఊంజల్ సేవ
మదనపల్లె అర్బన, మే 26: స్థానిక ప్రసన్న వెంకటరమణ స్వా మి ఆలయంలో ఆదివారం స్వామివారి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా వైభవంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఉదయా న్నే స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరణలు చేసి విశేషంగా పూజలు నిర్వహిం చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించు కున్నారు. రాత్రికి స్వామివారి శయనోత్సవంలో భాగంగా పవలింపు సేవ చేశారు. ఈకార్యక్రమాలను ఆలయ ఈవో రమ ణ పర్యవేక్షించారు.
Updated Date - May 26 , 2024 | 11:48 PM