పాలకులం కాదు.. ప్రజా సేవకులం!
ABN, Publish Date - Nov 01 , 2024 | 11:24 PM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృ త్వంలోని కూటమి ప్రభు త్వం లో భాగస్వామ్యులైన తాము పాలకులం కాదని.. ప్రజా సేవకులమని, పీలేరు ఎమ్మె ల్యే నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాంఫ గంజాయిపై ఉక్కుపాదం
దీపం-2 పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌రెడ్డి
పీలేరు, నవంబరు 1(ఆంధ్ర జ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృ త్వంలోని కూటమి ప్రభు త్వం లో భాగస్వామ్యులైన తాము పాలకులం కాదని.. ప్రజా సేవకులమని, పీలేరు ఎమ్మె ల్యే నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకనే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తు న్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దీపం-2 పథకాన్ని శుక్రవారం ఆయన పీలేరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రారంభించి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు సిలిండర్లు ఉచి తంగా ఇస్తామని అనంతరం మహిళలకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు. పీలేరు మండలంలో దాదాపు 27 వేల మందికి ప్రభుత్వం ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేయనుందన్నారు. గంజాయి విక్రయంలో ఎవరున్నా ఉపేక్షించవద్దని పోలీసుల ను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు భీమేశ్వర రావు, టీడీపీ నాయకులు అమరనాథరెడ్డి, కోటపల్లె బాబు, శ్రీకాంత రెడ్డి, పురం రామ్మూర్తి, మల్లెల రెడ్డిబాషా, నారే సతీశ, లక్ష్మీకర, పోలిశెట్టి సురేంద్ర, భాస్కర రెడ్డి, పురం రెడ్డమ్మ, మల్లెల సాధన, రెడ్డిరాణి, స్వర్ణలత, షమ, రమాదేవి, సుభ్రదమ్మ, తదితరులు పాల్గొన్నారు.
మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత జయచంద్రారెడ్డి
ములకలచెరువు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): మహిళల సం క్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తంబళ్లప ల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్ధానిక ఇండెన గ్యాస్ కార్యాలయం సమీపం లోని మైదానంలో శుక్రవారం నియోకవర్గంలోని ఆరు మండ లాల లబ్ధిదారులకు దీపం - 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న ఘటన సీఎం చంద్రబాబునాయుడుకే దక్కుతుం దన్నారు. ఇప్పటికే పింఛన్ల హామీ అమలు చేసి దీపావళి పండగ సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రా రంభించామన్నారు. కార్యక్రమంలో ఆరు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు ప్రదీప్, తపస్వీని, హరిప్రసాద్, శ్రీరా ములునాయక్, అన్సారీ, సయ్యద్‌మహమ్మద్, హరినారాయణ, బీజేపీ నేత గోపాల్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, జిల్లా కార్యదర్శి యర్రగుడి సురేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన కేవీ రమణ, తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనాధరెడ్డి, తంబళ్లపల్లె మండల కన్వీనర్ రెడ్డెప్పరెడ్డి, నేతలు తులసీధర్‌నాయుడు, మొటుకు శివ, ఎండీ మస్తాన, శ్రీనివాసులు, గంగా దేవి, భజంత్రి రామాంజులు, ఎర్రంరెడ్డి, కిట్టన్న, వేణుగోపాల్‌రెడ్డి, ఇండెన గ్యాస్ నిర్వాహకుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 01 , 2024 | 11:24 PM