మేం కాదు.. మీరే పోటీ చేయలేని దద్దమ్మలు
ABN, Publish Date - Dec 15 , 2024 | 12:09 AM
‘మేం కాదు.. మీరే పోటీ చేయలేని దద్దమ్మలు’ అని టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇనచార్జ్ బీటెక్ రవి ధ్వజమెత్తారు.
టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇనచార్జ్ బీటెక్ రవి
పులివెందుల టౌన, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘మేం కాదు.. మీరే పోటీ చేయలేని దద్దమ్మలు’ అని టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇనచార్జ్ బీటెక్ రవి ధ్వజమెత్తారు. నీటి సంఘాల ఎన్నికలకు సం బంధించి ఎంసీ అవినా్‌షరెడ్డి ‘ఎన్నికల్లో గెలవలేని దద్దమ్మలు’ అంటూ మాట్లాడారన్నారు. అందుకు మేం కాదు దద్దమ్మలు.. పన్ను కట్టడానికి కానీ, నా మినేషన వేయడానికి కానీ తహసీల్దార్ కార్యాలయాలకు రాలేని దద్దమ్మలు మీరేనన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగనమోహనరెడ్డి ప్రజాస్వామ్యం ఇబ్బంది పడిందా లే క అసలైన ప్రజాస్వామ్యం ఇబ్బంది పడిందో ఎంపీ అవినా్‌షరెడ్డి చెప్పాలన్నారు. గత 30 సంవత్సరాలుగా, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పులివెందుల నియోజకవర్గంలో ఎటువంటి రాజకీయాలు చేశారో అందరికీ తెలుసన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎంపీడీఓ కార్యాలయాల వద్ద జీపులు అడ్డుపెట్టి కుర్చీలు వేసుకొని కూర్చుని నామినేషన వేయడానికి వచ్చిన టీడీపీ నాయకుల నామినేషన పత్రాలను గుంజుకొని దౌర్జన్యాలకు పాల్పడింది మీ రు కాదా అని ప్రశ్నించారు. నాడు మీరు నేర్పిన పాఠం ప్రకారమే మేము కూడా చేస్తే ఏడుపు గొట్టు మాటలు మాట్లాడడం ఏమిటన్నారు.
Updated Date - Dec 15 , 2024 | 12:09 AM