ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించండి

ABN, Publish Date - Oct 28 , 2024 | 11:20 PM

గ్రీవెన్సడే కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సబ్‌కలెక్టర్‌ మేఘ స్వరూప్‌ మండల అధికారులను ఆదేశించారు.

సబ్‌కలెక్టరేట్‌ గ్రీవెన్సడేలో ప్రజల అర్జీలను విచారిస్తున్న సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌

మదనపల్లె టౌన, అక్టోబరు 28(ఆం ధ్రజ్యోతి): గ్రీవెన్సడే కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సబ్‌కలెక్టర్‌ మేఘ స్వరూప్‌ మండల అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌(గ్రీవెన్సడే) కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి 78 అర్జీలు వచ్చాయి. వాటన్నింటి పరిశీలించి అర్జీదారుల సమస్యలను సావధానంగా విన్న సబ్‌కలెక్టర్‌ సంబంధిత అధికారులతో ఫోనలో మాట్లాడారు. అంతే కాకుండా అర్జీలను ఆయా మండల తహసీల్దార్‌లకు రెఫర్‌చేశారు. కాలువ నిర్మాణానికి తమ భూములు సేకరించి ఐదేళ్లు గడుస్తున్నా ఇంత వరకు నష్టపరిహారం ఇవ్వలేదని పీటీఎం మండలం కందుకూరు రైతులు సబ్‌ కలెక్టర్‌కు విన్నవించారు. తన ఇంటి మందు చెత్త దిబ్బను పెట్టి కొంత మంది చెత్త అంతా తెచ్చి వేస్తున్నారని, మున్సిపల్‌ అధికారులకు తెలిపినా సమస్య పరిష్కారం కాలేదని పట్టణంలోని దేవళం వీధికి చెందిన రహంతుల్లా ఫిర్యాదు చేశాడు. తమ భూమిలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారని, తనకు తప్ప మిగిలిన వారికి పరి హారం చెల్లించారని, కనీసం చింతచెట్లకు కూడా పరిహారం ఇవ్వకుండా వీఆర్వో ఆల స్యం చేస్తున్నాడని మదనపల్లె మండలం సీటీఎం గ్రామానికి చెందిన ఆదినారాయణ ఫిర్యాదు చేశాడు. బసినికొండ పంచాయతీలోని స్వామిచెరువు సప్లై చానల్‌ను శేఖర్‌ అనే వ్యక్తి పూడ్చివేసి కబ్జా చేశాడని ఎ.మనోహర్‌ నాయుడు సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వాటన్నింటిపై సంబంధిత అధికారులు వెళ్లి విచారించి ఆక్రమణలు తొలగిం చాలని సబ్‌కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - Oct 28 , 2024 | 11:20 PM