అధికారులు తీరు మార్చుకోవాలి : చమర్తి
ABN, Publish Date - Nov 09 , 2024 | 11:52 PM
ప్రభు త్వం మారినా ఇంకా వైసీపీ పాలనలో ఉన్నామనే భ్రమలో ఉన్న అధికారులు తమ తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్ రాజు హెచ్చరించారు.
సుండుపల్లి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వం మారినా ఇంకా వైసీపీ పాలనలో ఉన్నామనే భ్రమలో ఉన్న అధికారులు తమ తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్ రాజు హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో అయ న కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుండుపల్లి మండల అధ్యక్షుడు కళ్లే రెడ్డప్ప, అర్గనైజింగ్ సెక్రటరీ మాలేపాటి శివరాం నాయుడు మాట్లాడుతూ మండలంలో పల్లె పండు గ నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. అబివృద్ధి పనులను కొంత మంది ప్రజా ప్రతినిధులు అడ్డుకుంటున్నారన్నారు. అనంతరం చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం కార్యకర్తలకు అండగా ఉందని, పార్టీ కోసం కష ్టపడిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రాజు, ఎంపీటీసీ మాజీ సభ్యులు బెల్లాల రమణయ్య, మోహన్ బాబు నాయుడు, మాలేపాటి సురేష్ నాయుడు, జనార్దన్, ఎల్వీ రమణ, కిరణ్, సుబ్బరాం, మస్తాన్, చంద్రమౌళి, చంద్ర మోహన్, మంగిరి సురేష్, రాయవారం సర్పంచ్ మహ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
నందలూరు: స్థానిక ప్రవీణ్ బ్రిక్స్‌లో మండల టీడీపీ అధ్యక్షుడు జంగంశెట్టి సుబ్బయ్య ఆధ్వర్యం లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో వేగం పెంచాలన్నారు.
Updated Date - Nov 09 , 2024 | 11:52 PM