వెల్లువెత్తిన మానవత్వం
ABN, Publish Date - Sep 11 , 2024 | 10:48 PM
వరద బాధితులకు మదనపల్లె నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచారని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. బుధవారం స్థానిక టౌనహాల్లో 3 వేల నిత్యావసర కిట్లు, 500 గ్యాస్ స్టౌవ్‌లు, ఇతర సామగిని ప్యాక్ చేసి లారీలకు లోడ్ చేశారు.
మదనపల్లె టౌన, సెప్టెంబరు 11: వరద బాధితులకు మదనపల్లె నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచారని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. బుధవారం స్థానిక టౌనహాల్లో 3 వేల నిత్యావసర కిట్లు, 500 గ్యాస్ స్టౌవ్‌లు, ఇతర సామగిని ప్యాక్ చేసి లారీలకు లోడ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె ప్రజలు తమ వంతుగా అందజేసిన విరాళాలతో పాటు, తన వంతు రూ.5 లక్షలు వెచ్చించి ఐదు వేల మందికి సరిపడా సరుకులు, వస్తువులు సిద్ధం చేశామన్నారు. మదనపల్లె నుంచి 20 మంది టీడీపీ నాయకుల తో విజయవాడకు వెళ్లి అక్కడ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఈ కిట్లను పంపిణీ చేస్తా మన్నారు. సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ వారం రోజులుగా వరద బాధితుల అవస్థలు, వారిని ప్రభుత్వం, అధికారులు ఆదుకుంటు న్న తీరును నిత్యం దినపత్రికలు, టీవీల్లో చూస్తున్నామని, దీనికి స్పందించి మదనపల్లె ప్రజలు ఈ విరాళాలను అందించడం అభినం దనీయమన్నారు. టీడీపీ నాయకులు విద్యాసాగర్, రామకృష్ణాచారి, బాలుస్వామి, శివన్న, షంషీర్, సంగం హరి తదితరులు పాల్గొన్నారు.
8 టన్నుల టమోటా తరలింపు
మదనపల్లె టమోటా యార్డులోని మండీ యజమానులు 8 టన్నుల టమోటాను సరఫరా చేశారు. బుధవారం స్థానిక మార్కెట్‌యార్డులో టమోటాలను నింపిన లారీకి మండీ యజమానులు నాగయ్య, ఎస్‌ఏ మస్తాన జెండా ఊపి విజయవాడకు పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే షాజహానబాషా సూచనలతో 8 టన్నుల టమోటాలను ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో టమోటా మండీ యజమానులు ఖాసీమ్, ఖాజా, టీవీఎస్ బాబు, సురేంద్ర పాల్గొన్నారు.
విద్యార్థుల ఆర్థిక సాయం
మదనపల్లె అర్బన: స్థానిక సొసైటీ కాలనీలోని విజయభారతి ఇంగ్లిషు మీడియం హైస్కూల్ విద్యార్థులు విజయవాడ వరద బాధితులకు ప్రిన్సిపాల్ ఎన సేతు ఆధ్వర్యంలో రూ. 50 వేలు ఎమ్మెల్యే షాజహాన చేతుల మీదుగా సీఎం సహాయనిధికి పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలోని వారికి సాయం చేయాలనే ఆలోచన రావడమే గొప్ప విషయం అన్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎంవీఆర్ లాడ్జి యాజమాని వెంకటరమణ ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 2 లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు షంషీర్, నాగూర్‌వలి, జేసీబీ వేణు, శివన్న. లక్ష్మున్న, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 11 , 2024 | 10:48 PM