ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతన్నకు వేరుశనగ కష్టాలు..!

ABN, Publish Date - Sep 19 , 2024 | 11:50 PM

ఖరీఫ్‌ వేరుశనగ పంటతో రైతన్న నిండామునిగాడు.

సి.గొల్లపల్లి సమీపంలో పూర్తిగా ఎండిన వేరుశనగ పంట పాపేపల్లి సమీపంలో ఎండిన పంటను వడిపిన రైతు రామచంద్ర

పెద్దమండ్యం, సెప్టెంబరు 19: ఖరీఫ్‌ వేరుశనగ పంటతో రైతన్న నిండామునిగాడు. పంటకు కాయలు ఏర్పడే సమయంలో వర్షాలు మొహం చాటేయడంతో తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీం తో చేసేదిలేక కొందరు రైతులు పంటను మధ్య లో వడిపివేశారు. పెద్దమండ్యం మండలం పా పేపల్లికు చెందిన రామచంద్ర అనే రైతు ఎండి పోయిన పంటను గురువారం వడుపుకున్నారు. ఎకరా వేరుశనగ పంట పూర్తిగా ఎండి పోయి చెట్టుకు రెండు మూడు కాయలు ఉన్నా అవికూ డా నాణ్యతలేనికాయలు ఉండడంతో పంట చేతి కి అందలేదు, కనీసం పశువులకు మేతైన మిగు లుతుందోలేదో తెలియదని ఆవేదన వ్యక్తం చేశా డు. ఎండిపోయిన చెట్లును పెరకడంతో అవికూ డ చేతికందక చేతులు బొబ్బలెక్కాయి. ఎకరానికి రూ. 35 వేలు ఖర్చు చేశారు. సాగు పెట్టుబడి కూడా చేతిరాదని రైతు వాపోయాడు. మండలం లో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజనలో వేసిన వేరుశనగ పంట పూత పిందె దిగుబడి సమయంలో వాన పడకపోవడంతో ఈ దుస్థితి వచ్చిందని రైతన్న లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్‌లో మండ లంలో 2వేల ఎకరా ల్లో వేరుశనగ పంట సాగు చేయగా మొదట్లో బాగా ఉన్న తర్వాత వర్షాలు లేకపోవడంతో రైతులు పంటపై ఆశలు వదు లుకున్నారు. ఎండ వేడిమితాకిడికి ఖరీప్‌ వేరు శనగ చెట్లు పూర్తిగా ఎండిపోయి చెట్లు నల్లబారి పోయాయి. దీంతో పంట దిగుబడులు పూర్తిగా రాకుండా కనీసం చెట్లుకూడా పీకడానికి వీలు లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చేసేది లేక పంట పోయిన పశువులకు మేత కోసం ఎండిన వేరుశనగ పంటను కొంత మంది రైతులు వడుపుతున్నారు. దీంతో ఈ ఏడాది వేరుశనగ రైతుకు తీవ్ర కష్టం నష్టం మిగిల్చింది. ప్రభుత్వం చర్యలు తీసుకొని ఖరీఫ్‌లో వేరుశనగ పంట దెబ్బతిన్న రైతులను అన్నివిధాల ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే పెద్దమం డ్యం మండలాన్ని కరువు మండలంగా ప్రకటిం చి రబీలోనైనా పంటల సాగుకు సహకరించాలని రైతన్నలు కోరుతున్నారు.

Updated Date - Sep 19 , 2024 | 11:50 PM