ప్రజలను చైతన్యవంతులను చేయాలి
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:59 PM
దోమల నివారణ విషయంలో ప్రజలను చైతన్యవంతులను చేయాలని జిల్లా మలేరియా నివారణాఽధికారిణి మ నోరమ సిబ్బందిని ఆదేశించారు.
పులివెందుల రూరల్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): దోమల నివారణ విషయంలో ప్రజలను చైతన్యవంతులను చేయాలని జిల్లా మలేరియా నివారణాఽధికారిణి మ నోరమ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని నగరిగు ట్ట, జయమ్మకాలనీలలో పర్యటించారు. సిబ్బంది చేస్తున్న ఫీవర్ సర్వే, లార్వా సర్వేను పరిశీలించా రు. అనంతరం ఆమె మాట్లాడు తూ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ రక్తపరీక్షలు చేయాలన్నారు. దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల గురించి వివరించాలన్నారు. ప్రతి ఇంటిని తిరిగి నీటి నిల్వల్లో దోమ లార్వాను గుర్తించాలన్నారు. దోమల వలన మలేరియా, డెంగ్యూ, బోదకాలు, మెదడువాపులాంటి ప్రా ణాంత వ్యాధులు ప్రబలుతాయన్నారు. కావున దోమలు పుట్టకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య, ఎపీహెచఈఓ శంకర్‌రెడ్డి, ఆరోగ్య, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Nov 29 , 2024 | 11:59 PM