ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.లక్షలు పోసి.. లక్ష్యం మరచి..!

ABN, Publish Date - Nov 10 , 2024 | 11:42 PM

పారిశుధ్య నిర్వహణ అనేది గ్రామ పంచాయతీల ప్రాథమిక బాధ్యత. పారిశుధ్య నిర్వహణ ద్వారా సంపద సృష్టించడం అనేది గ్రామ పంచాయతీల చరిత్రలో నూతన అధ్యాయంగా చెప్పవచ్చు. అందుకే చెత్త.. చెత్తకాదు సద్వినియోగం చేస్తే సంపద అన్నారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య నిర్వహణ చేయకపోతే ప్రజలు అనేక అనారోగ్య, ఆర్థికబాధలను ఎదుర్కొంటారు.

సేకరించిన చెత్తకు నిపు పెట్టిన వైనం

కాగితాల్లోనే సంపద సృష్టి పంచాయతీలకు ఆదాయమేదీ..?

సిబ్బందికి తప్పని వేతన యాతన

ప్రొద్దుటూరు రూరల్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): పారిశుధ్య నిర్వహణ అనేది గ్రామ పంచాయతీల ప్రాథమిక బాధ్యత. పారిశుధ్య నిర్వహణ ద్వారా సంపద సృష్టించడం అనేది గ్రామ పంచాయతీల చరిత్రలో నూతన అధ్యాయంగా చెప్పవచ్చు. అందుకే చెత్త.. చెత్తకాదు సద్వినియోగం చేస్తే సంపద అన్నారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య నిర్వహణ చేయకపోతే ప్రజలు అనేక అనారోగ్య, ఆర్థికబాధలను ఎదుర్కొంటారు.

పల్లెసీమల్లో చెత్తనిర్వహణ అధ్వానంగా ఉంది. గ్రామాల్లో వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రహదారి పక్కనే అపరిశుభ్రత తాండవిస్తోంది. పరిశుభ్రత భారతావని కోసం అటు కేంద్రం, ఇటు రాష్ట్రం స్వచ్ఛ సంకల్పం స్ఫూర్తి ముందడుగు వేశాయి. పంచాయతీల్లో సంపద సృష్టించి అదనపు ఆదాయాన్ని పొందాలని చేపట్టిన కార్యక్రమం అమలు తీరు రానురాను తీసికట్టుగా మారింది. చెత్తనుంచి సేంద్రియ ఎరువు తయారీ, వాటి విక్రయాలు, తద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయం అనేది క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు (ఎస్‌డబ్ల్యూపీసీ) చాలా వరకు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ప్రతి గడప నుంచి తడి, పొడి చెత్తను సేకరిస్తున్న సిబ్బందికి కొన్ని నెలలుగా వేతనాలు అందక యాతన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్‌డబ్ల్యూపీసీల నిర్వహణపై చూపించిన నిర్లక్ష్యం, గ్రామ ప్రజల ఆరోగ్యానికి శాపంగా మారింది. పంచాయతీలకు అదనపు ఆదాయం దూరమైంది. నిధులు లేక చాలా చోట్ల జీతాలు చెల్లించక చేతులెత్తేశారు. దీంతో స్వచ్ఛ స్ఫూర్తి అలంకారప్రాయంగా మారింది. చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాలు దిష్టిబొమ్మలుగా దర్శనమిస్తున్నాయి.

ఫ అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉపాధి హామీ పథకం కింద ఎస్‌డబ్ల్యూపీసీ సెంటర్ల ఏర్పాటు చేశారు. ప్రతి పంచాయతీలో స్థల సేకరణ, షెడ్ల నిర్మాణం, తడి, పొడి చెత్తను వేరుగా ఉంచే తొట్ల నిర్మాణం, చెత్త తరలింపు వాహనాల సమకూర్పు, కరెంటు, రోడ్డు, నీటి వసతులు ఇలా ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.4 లక్షల నుంచి పెద్ద పంచాయతీలకు అయితే రూ.8 లక్షల వరకు ఖర్చు చేశారు. పల్లెల్లో ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించడానికి క్లాప్‌మిత్రులు, పంచాయతీల్లో అయితే కొంతమంది పారిశుధ్య కార్మికులను అదనంగా కాంట్రాక్టు పద్ధతిన నియమించుకున్నారు. ఈకేంద్రాల్లో ఒక్కో సెంటర్‌కు ఒక్కొక్క కాపలాదారుని నియామకం జరిగింది. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమో, కేంద్రాలపై దృష్టి సారించకపోవడమో, పంచాయతీలకు ఆర్థిక వనరులు అందుబాటులో లేక సిబ్బందికి వేతనాలు అందక నిర్లక్ష్యానికి గురయ్యాయి. కొన్ని చోట్ల సిబ్బందికి ఆరు నెలలు, మరికొన్ని ప్రాంతాల్లో ఏడాది పాటు కూడా వేతనాలు చెల్లింపు జరుగలేదని సమాచారం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు మండల పరిధిలో 13 కేంద్రాలు, రాజుపాళెం మండల పరిధిలో 15 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు మండలంలోని సీతంపల్లె పంచాయతీలో స్థల వివాదం వలన నిర్మాణం జరుగలేదు. నంగనూరుపల్లె పంచాయతీలో అసంపూర్తిగా ఎస్‌డబ్ల్యూపీసీ సెంటర్‌ మిగిలిపోయింది. గోపవరం, దొరసానిపల్లెలో నిర్మించిన కేంద్రాలకు రహదారి సమస్యలు వెంటాడుతున్నాయి. మిగిలిన 11 కేంద్రాల్లో సేంద్రియ ఎరువుల తయారీ అన్నది కలగా మారింది. రాజుపాళెం మండల పరిధిలో 15 పంచాయతీలకుగాను 15 కేంద్రాల నిర్మాణాలు ఉన్నాయి. సిబ్బంది వేతన బకాయిలు అలాగే ఉండిపోయాయి. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంతో సంపద సృష్టికి దూరంగా తయారయ్యాయి. చాలా ప్రాంతాల్లో సేకరించిన చెత్తను ఏమి చేయాలో దిక్కుతోచక నిప్పుపెడుతున్నారు. చెత్త తరలించే మూడు చక్రాల వాహనాలు పాడయ్యాయి. లక్షలు వెచ్చించి నిర్మించిన ఎస్‌డబ్ల్యూపీసీలు అనుకున్న లక్ష్యానికి దూరంగా అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి.

వినియోగంలోకి తెస్తున్నాం

గ్రామాల్లో నిర్మించిన ఎస్‌డబ్ల్యూపీసీలను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు వాటిని సిద్ధం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వీటి నిర్వహణపై దృష్టి సారిస్తోంది. ఈ కేంద్రాల్లో ఫెన్సింగ్‌, కరెంటు, నీరు, మరుగుదొడ్ల సదుపాయాల పునరుద్ధరణ పనులకోసం ప్రతిపాదనలు పంపాం. త్వరలో ఈ తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకొస్తాం.

రామాంజనేయరెడ్డి, ఈవోపీఆర్‌డీ, ప్రొద్దుటూరు.

Updated Date - Nov 10 , 2024 | 11:43 PM