పత్తిలో గులాబి రంగు పురుగు నివారణ ఇలా...
ABN, Publish Date - Sep 11 , 2024 | 11:29 PM
ప్రస్తుతం సాగులో ఉన్న పత్తిపంటలో గులాబి రంగు పురుగు నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త భాగవతిప్రియ అన్నారు.
పులివెందుల, సెప్టెంబరు 11: ప్రస్తుతం సాగులో ఉన్న పత్తిపంటలో గులాబి రంగు పురుగు నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త భాగవతిప్రియ అన్నారు. బుధవారం తొండూరు మండలంలోని భద్రంపల్లె, తొండూరు గ్రామాలలో ముద్దనూరు ఏడీఏ వెంకటసుబ్బయ్య, తొండూరు వ్యవసాయాధికారి మధుసూధనరెడ్డితో కలిసి పంటలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ గులాబి రంగు పురుగు నిఘా కోసం లింగాకర్షక బుట్టలు అమర్చి వరుసగా మూడు రోజు లు 8 పురుగులనుగమనించినా, గుడ్డి పువ్వుల సంఖ్య ఎక్కువగా ఉన్న, 20 కాయలను గమనించినపుడు రెండు గొంగళి పురుగులున్న వెంటనే నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పలు ఎరువులు, పురుగుమందులను సూచించారు. ఏఓ మధుసూధనరెడ్డి మాట్లాడుతూ పంటనమోదు చేసుకున్న ప్రతి రైతు ఈ-కేవైసీ పూర్తిచేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు శిక్షణ కేంద్ర ఏఓ నాగభూషణ్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Sep 11 , 2024 | 11:29 PM