శనగలో యాజమాన్య పద్ధతులు పాటించాలి
ABN, Publish Date - Oct 25 , 2024 | 10:56 PM
రైతులు శనగ పంటలో యాజమాన్య పద్ధతులు పాటించాలని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త వీరయ్య తెలిపారు.
సీకేదిన్నె, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రైతులు శనగ పంటలో యాజమాన్య పద్ధతులు పాటించాలని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త వీరయ్య తెలిపారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో బయోటెక్ కిసాన్‌హబ్ పథకంలో భాగంగా కొత్తరకం శనగ రకాలను, విత్తనశుద్ధి మందులను రైతులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌బీఈజీ 776 అనే రకం శనగ ప్రస్తుతం విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుందని తెగుళ్లు తట్టుకుని వంద రోజుల్లో పంట చేతికి వస్తుందన్నారు. ఎకరాకు 7 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుందన్నారు. కేవీకే శాస్త్రవేత్తలు మహే్‌షబాబు, సాయిమహేశ్వరి పాల్గొన్నారు.
Updated Date - Oct 25 , 2024 | 10:56 PM