ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కబ్జా నుంచి శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడండి

ABN, Publish Date - Nov 07 , 2024 | 11:53 PM

కబ్జా నుంచి శ్మశాన వాటిక స్థలం కాపాడాలని ఓబులంపల్లె గ్రా మ దళితులు ప్రభుత్వాన్ని కోరారు.

తహసీల్దార్‌కు ఓబులంపల్లె దళితుల ఫిర్యాదు

వాల్మీకిపురం, నవంబరు 7(ఆంధ్ర జ్యోతి): కబ్జా నుంచి శ్మశాన వాటిక స్థలం కాపాడాలని ఓబులంపల్లె గ్రా మ దళితులు ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు ఈ విషయమై గురువారం తహసీల్దార్‌ పామిలేటికి వారు ఫిర్యా దు చేశారు. ఓబులంపల్లె గ్రామంలో దశాబ్ద కాలంగా దళితవాడకు సంబంఽ దించిన సర్వే నెంబర్‌ 609లో శ్మశాన వాటిక స్థలాలను గ్రామానికి చెందిన ఆగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు కబ్జా కు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలో జరిపిన అక్రమ తవ్వకాల ద్వారా తమ పూర్వీకుల కబేలాలు కూడా బయటపడ్డాయని, ఏమిటని నిలదీస్తే ఈ భూములు తమకు పట్టా ఉన్నాయని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షం లో దళితులంతా కలిసి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ విషయమై తహసీల్దార్‌ పామిలేటి మాట్లాడుతూ ఓబులంపల్లెలో శ్మశాన వాటిక స్థలాలు పరిశీ లించి తప్పక న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్ర మంలో ఓబులంపల్లె దళితవాడకు చెందిన మహిళలు, యువత, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 11:53 PM