ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాధ్యతగా ‘మీ-సేవ’లు అందించండి

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:03 AM

ప్రజలకు మీ -సేవ కేంద్రాల ద్వారా వివిధ రకాల సేవలను ఎలాంటి అసౌక ర్యం లేకుండా బాధ్యతగా అందేలా కేంద్రాల నిర్వాహకులు చూడాలని డీఎల్‌డీవో అమరనాథరెడ్డి సూచించారు.

పులికల్లు సచివాలయంలో సిబ్బందికి సూచనలు ఇస్తున్న డీఎల్‌డీవో అమరనాథ్‌రెడ్డి, చిత్రంలో ఎంపీడీవో, ఈవోఆర్డీ

పెద్దతిప్పసముద్రం నవంబర్‌ 12 (ఆంద్రజ్యోతి) :ప్రజలకు మీ -సేవ కేంద్రాల ద్వారా వివిధ రకాల సేవలను ఎలాంటి అసౌక ర్యం లేకుండా బాధ్యతగా అందేలా కేంద్రాల నిర్వాహకులు చూడాలని డీఎల్‌డీవో అమరనాథరెడ్డి సూచించారు. మంగళ వారం ఆయన ఎంపీడీవో అబ్దుల్‌ కలాం అజాద్‌, ఈవోఆర్డీ యోగానంద్‌లతో కలిసి పులికల్లు మీ సేవ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పులికల్లు గ్రామంలో కాకుండా బి.కొత్తకోటలో మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తుండడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. మీ సేవ కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరిగినా సహించేది లేదంటూ, అలాంటి కేంద్రాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. మీ సేవ కేంద్రాల్లో లబ్ధిదారుల నుంచి ఎలాం టి ఫిర్యాదులు వచ్చినా అటువంటి సెంటర్లపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మీ సేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తే సహించేది లేదన్నారు. రికార్డులను పక్కాగా నిర్వహించాలన్నారు. అనం తరం కాట్నగల్లు సచివాలయాన్ని పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ఇంటింటి సర్వే చేయడంతోపాటు ప్రతి ఇంటిని మాఫింగ్‌ చేసి వారికి కేటాయించిన ఇళ్లను పూర్తి చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా అపార్‌ కార్డులకు సంబంధించి జనన దృవీకరణ కోసం విద్యా ర్థులను సచివాలయాల చుట్టూ తిప్పు కోకుండా వారికి అందు బాటులో ఉండి అపార్‌కు సహకరించాలన్నారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:03 AM