ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజంపేట పూర్వ ఆర్డీవో కోదండరామిరెడ్డి సస్పెన్షన్‌

ABN, Publish Date - Aug 30 , 2024 | 11:46 PM

రాజంపేట రెవెన్యూ డివిజన్‌ ఆర్డీవోగా గతంలో పనిచేసిన డి.కోదండరామిరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

రాజంపేట, ఆగస్టు 30: రాజంపేట రెవెన్యూ డివిజన్‌ ఆర్డీవోగా గతంలో పనిచేసిన డి.కోదండరామిరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కోదం డరామిరెడ్డి తిరుపతిలో గాలేరు-నగరి సుజల స్రవం తి యూనిట్‌-1 స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరుగా పనిచే స్తున్నారు. గతంలో రాజంపేట ఆర్డీవోగా పనిచేస్తూ అనేక భూ వివాదాలకు ఆజ్యం పోసి అర్ధాంతరంగా తిరుప తికి బదిలీపై వెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..

2022లో కోదండరామిరెడ్డి రాజంపేట ఆర్డీవోగా పనిచేస్తూ అదే సమయంలో గాలేరు-నగరి ప్రాజెక్టు భూసే కరణ విభాగం 4వ యూనిట్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు తీసుకుని పనిచేసేవారు. ఆ సమ యంలో గాలేరు-నగరి భూసేకరణలో భాగంగా కె.నాగిరెడ్డి భూ వివాదానికి సంబంధించి కౌంటర్‌ అఫిడవిట్‌ హైకోర్టుకు దాఖలు చేయడంలో వివాదం రేగింది. ఈ విషయంపై ఆ భూమికి సంబంధించిన కె.నాగిరెడ్డి రిట్‌ పిటీషన్‌ నంబరు 119/2022 దాఖలు చేశారు. ఈ విషయంలో డిప్యూటీ కలెక్టర్‌ గా పనిచేస్తున్న కోదండరామిరెడ్డి కోర్టుకు కౌంటర్‌ అఫిడ విట్‌ను సక్రమంగా దాఖలు చేయడంలో విచారణ సందర్భం గా హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి తలె త్తింది. దీంతో జలవనరులశాఖ ఉన్నతాధికారులు కోదండరా మిరెడ్డిపై గతంలో శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ సమయంలో కోదండరామిరెడ్డి కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖ లు చేసే సమయంలో ఆర్‌అండ్‌ఆర్‌ పాలసి- 2005, ఆర్‌ఎఫ్‌సీటీఎల్‌ఏ ఆర్‌అండ్‌ఆర్‌ యాక్టు 2013 చట్టాల్లోని అంశాలు విస్మరించారని, హైకోర్టులో వాస్తవాలను వివరించడంలో విఫలమయ్యారని గు ర్తించారు. దీనివల్ల హైకోర్టు ఎదుట ప్రభు త్వానికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్ప డిందని జలవనరులశాఖ ఉన్నతాధికా రులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. దీంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ కోదండరామిరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈయన సెప్టెంబరులో పదవీ విరమణ చేయనున్నారు. ఒక నెల ముందు సస్పెండ్‌కు గురికావడం సంచలనం రేపింది.

రాజంపేటలో భూ కబ్జాలకు తెర

గత జగన్‌ ప్రభుత్వంలో 2022లో ఆర్డీవోగా పనిచేసిన కోదం డరామిరెడ్డి రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో వైసీపీ నేతలు వేలాది ఎకరాల భూకబ్జాలకు పాల్పడడంలో కోదండరామిరెడ్డి పాత్ర ఎంతో ఉందని చెబుతున్నారు. ఈయన అప్పటి ఎమ్మె ల్యేల అనుచరులకు అడుగులకు మడుగులొత్తుతూ అనేక భూకబ్జాలు జరిగేందుకు ప్రధాన కారకుడయ్యాడని ఆరోపణ లు బలంగా ఉన్నాయి. రాజంపేట పట్టణానికి అల్లంత దూ రంలో రూ.కోట్లు విలువ చేసే పోలి గుట్ట భూకబ్జాకు, పుల్లం పేటలో కొల్లం గంగిరెడ్డి అనుచరులు చేసిన భూకబ్జాలకు, నందలూరు, ఓబులవారిపల్లె మండలంలో వందలాది ఎకరాల భూకబ్జాలకు వైసీపీ నేతలు పాల్పడగా.. ఎటువంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. కాగా ఈయన రేణి గుంట వద్ద స్వగృహం నిర్మించుకునే సమయంలో ఇసుక, కం కర, ఇటుకలు, ఇంటికి కావాల్సిన టేకు కలపతో సహా రా జంపేట నుంచే భూకబ్జాదారులు సరఫరా చేసినట్లు చెబు తారు. ఆ సమయంలో ఈ వ్యవహారం పెద్ద హాట్‌టాఫిక్‌గా మారింది. ఇతనిపై ఆరోపణలు భారీగా రావడంతో వైసీపీ లోని వైరివర్గాలు తిరుపతికి బదిలీ చేయించినట్లు సమాచారం.

Updated Date - Aug 30 , 2024 | 11:46 PM

Advertising
Advertising