రోడ్డుపొరంబోకు స్థలంలో అక్రమ నిర్మాణాల తొలగింపు
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:51 PM
మదనపల్లె మండలం కొండా మరిపల్లె రెవిన్యూగ్రామంలో రోడ్డు పొరంబోకు స్థలంలో నిర్మించిన అక్ర మ నిర్మాణాలను రెవెన్యూ అధికారు లు తొలగించారు.
మదనపల్లె టౌన, డిసెంబరు 2(ఆంధ్ర జ్యోతి): మదనపల్లె మండలం కొండా మరిపల్లె రెవిన్యూగ్రామంలో రోడ్డు పొరంబోకు స్థలంలో నిర్మించిన అక్ర మ నిర్మాణాలను రెవెన్యూ అధికారు లు తొలగించారు. స్థానిక సీటీఎం రోడ్డులోని దేవతానగర్ వద్ద సర్వేనెం బర్ 1050లో రోడ్డు పొరంబోకు స్థలం ఉంది. ఈ క్రమంలో కొందరు ఈ స్థలా న్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. ఇందులో శ్రీరాములు అనే వ్యక్తి మదన పల్లె సబ్‌కలెక్టర్‌కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల చేయడంతో సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు మదనపల్లె రెవెన్యూ అధికారులు రోడ్డు పొరంబోకు స్థలంలో నిర్మాణాలపై సర్వే అధికారులు నిర్దారించడంతో వీఆర్‌వో ప్రసాద్ ఆధ్వర్యంలో ఎక్స్‌కవేటర్ తీసుకెళ్లి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.
Updated Date - Dec 02 , 2024 | 11:51 PM