బంగారు దుకాణంలో చోరీ
ABN, Publish Date - Sep 23 , 2024 | 11:36 PM
మైదుకూరులోని ఓ బంగారు నగల దుకాణంలో ఆది వారం రాత్రి చోరీ జరి గింది. బాధితులు రూ.1.30 కోట్ల నగలు చోరీ అయ్యాయని తెలు పగా పోలీసులు మాత్రం రూ.12 లక్షల నగలు దొంగతనం అయ్యాయని అంటున్నారు. వివరాలు ఇలా..
రూ.1.30 కోట్ల వస్తువులు అపహరణ : బాధితులు
రూ.12 లక్షల నగలు చోరీ : పోలీసులు
మైదుకూరు రూరల్, సెప్టెంబరు 23: మైదుకూరులోని ఓ బంగారు నగల దుకాణంలో ఆది వారం రాత్రి చోరీ జరి గింది. బాధితులు రూ.1.30 కోట్ల నగలు చోరీ అయ్యాయని తెలు పగా పోలీసులు మాత్రం రూ.12 లక్షల నగలు దొంగతనం అయ్యాయని అంటున్నారు. వివరాలు ఇలా..
మైదుకూరులోని బద్వేల్ రోడ్డులో ఉన్న మిట్టా జువెలర్స్ యజమాని సురేశ్ గురువారం చెన్నైలో నిర్వహించే బంగారు నగల ఎగ్జిబిషన్‌కు వెళ్లాడు. దీంతో సురేశ్ తండ్రి సుబ్బరాయుడు, మరో కుమారుడు రెండు రోజుల పాటు వ్యాపారం నిర్వహించారు. ఆదివారం దుకాణం తెరవక పోవడంతో రాత్రివేళ దుండగులు దుకాణం వెనుకవైపు ఉన్న దాదాపు 10 అడుగులు ఎత్తుగల గోడ దూకి లోపలకు వచ్చారు. 3 షట్టర్లు, రెండు చెక్క తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. సీసీ కెమరాల వైర్లు కత్తిరించి, హార్డ్ డిస్క్‌ను తీసుకున్నారు. షోకేసులో ఉన్న బంగారు, వెండి వస్తువులు చోరీ చేశారు. అక్కడే ఉన్న లాకరు తెరవలేక పోయినట్లు తెలుస్తోంది. యజమాని సురేశ్ సోమవారం తెల్లవారుజామున తన మొబైల్ ఫోన్‌కు కనెక్టర్ అయిన దుకాణం సీసీ కెమెరాల దృశ్యాలను చూసేందుకు ప్రయ త్నించాడు. అయితే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే తండ్రి సుబ్బరాయుడుకు తెలిపాడు. ఆయన హుటాహుటిన దుకా ణం వద్దకు వెళ్లి తెరవగా చోరీ చేసినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాదాపు కోటి రూపాయల విలువైన బంగారు, 30 లక్షల విలువైన వెండి వస్తువులు చోరీకి గురైనట్లు యజమాని మిట్టా సురేశ్ సోమవారం మీడియాకు తెలిపారు. అయితే ఎస్‌ఐ మద్దిలేటి మాత్రం దాదాపు రూ.12 లక్షల విలువైన వస్తువులు మాత్రమే చోరీ అయ్యాయని మీడియాకు తెలిపారు.
Updated Date - Sep 23 , 2024 | 11:36 PM