ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్రికెట్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ విజయం

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:08 AM

విజయభారతీ విద్యాసంస్థల వైస్‌ ప్రిన్సిపాల్‌ నిశ్చిత సేత ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ విజయం సాధించింది.

రాయల్‌ చాలెంజర్స్‌ క్రీడాకారులను అభినందిస్తున్న విజయభారతీ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ సేతు

మదనపల్లె అర్బన, నవంబరు12(ఆంధ్ర జ్యోతి): విజయభారతీ విద్యాసంస్థల వైస్‌ ప్రిన్సిపాల్‌ నిశ్చిత సేత ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ విజయం సాధించింది. ఈ క్రికెట్‌ లీగ్‌లో ఎనిమిది జట్లు పాల్గొనగా వారికి నాలుగు లీగు మ్యాచలు నిర్వ హించారు. అనంతరం పైనల్‌కు చేరిన వీబీ సూపర్‌కింగ్స్‌తో రాయల్‌ చాలెంజ ర్స్‌ తలపడ్డాయి. ఫైనల్‌ మ్యాచలో నిర్ణీత 5 ఓవర్లు ఆట ముగిసే సమ యానికి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 46 పరుగులు సాధించింది. లక్ష్య చేధనకు దిగిన వీబీ సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మెన దూకుడుగా ఆడి తమ జట్టు విజ యతీరాలకు చేరే సమయంలో చివరి రెండు ఓవర్లలో బౌలర్లు ఉత్తమ ప్రదర్శనతో వరుస వికెట్లు పడగొట్టి పరు గులను కట్టడి చేశారు. ఒకానొక దశలో వీబీ సూపర్‌కింగ్స్‌ గెలుస్తోందనే ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. రాయల్‌ చాలెం జర్స్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ తనవైపు తిప్పుకున్నారు. దీంతో నిర్ణీత5 ఓవర్తు ముగిసే సమయానికి వీబీ సూపర్‌ కింగ్స్‌ 41 పరుగుల తీశారు. దీంతో రాయల్‌ చాలెంజర్స్‌ విజయం సాధించింది. విన్నర్స్‌కు ముఖ్య అతిఽథులుగా విచ్చేసిన బీజేపీ జాతీయ నాయకుడు చల్టపల్లె నరసింహురెడ్డి, విజయభారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ ఎన సేతూ విజేతలకు కప్‌ను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు రోజుల్లో మరింత మెరుగ్గా క్రీడాపోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండి ఆనంద్‌, నరేంద్రకుమార్‌, గుడ్‌ విల్‌ అజయ్‌, రాయలసీమ పాఠశాల ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:08 AM