గెలుపే లక్ష్యంగా పరుగెత్తాలి
ABN, Publish Date - Nov 11 , 2024 | 12:18 AM
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరైన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఆత్మవిశ్వాసంతో పరుగెత్తాలని జేసీ అదితిసింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జిల్లా స్పోర్ట్స్ అఽథారిటీ (డీఎస్‌ఏ) స్టేడియంలో వేకువజామున 3 గంటలకు ఇండియన ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఎంపికలు సంబంధిత రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నన పునీత అధ్యక్షతన ప్రారంభం అయ్యాయి.
యువతకు పిలుపునిచ్చిన జేసీ అదితిసింగ్
అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం
కడప స్పోర్ట్స్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరైన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఆత్మవిశ్వాసంతో పరుగెత్తాలని జేసీ అదితిసింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జిల్లా స్పోర్ట్స్ అఽథారిటీ (డీఎస్‌ఏ) స్టేడియంలో వేకువజామున 3 గంటలకు ఇండియన ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఎంపికలు సంబంధిత రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నన పునీత అధ్యక్షతన ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసీ అదితిసింగ్ హాజరై మొదటి దశ పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీకి హాజరైన అభ్యర్థులను ఉద్ధేశించి జేసీ మాట్లాడారు. అగ్నివీర్ ఆర్మీలో జాయిన అయ్యేందుకు జరిగే ఎంపికలకు ఇప్పటికే రాత పరీక్ష పూర్తయిందన్నారు. అందులో ఉత్తీర్ణత సాదించి.. ఫిజికల్ టెస్ట్‌కు హాజరై కడపకు వచ్చిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. ర్యాలీలో పాల్గొనే ప్రతిఒక్కరూ విజయకాంక్షతో ముందడుగు వేయాలన్నారు. ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా నిర్వహించే ఈ ఎంపికలో అఽభ్యర్థులు విజయం సాధించి దేశానికి భద్రతనిచ్చే గొప్ప యువశక్తిగా నిలవాలని ఆకాంక్షించారు. అభ్యర్థులు ఎవ్వరూ దళారులను నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో ఇర్విన, కడప మున్సిపల్ కార్పొరేషన కమిషనర్ మనోజ్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రాకేశచంద్, అనుబంధ సంఘాల అధికారులు పాల్గొన్నారు.
కాగా.. కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి 4000 మంది అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరు కానున్నారు. వీరిలో రోజుకు 800 మంది చొప్పున అభ్యర్థులకు ఐదురోజులపాటు ఎంపిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అభ్యర్థులు ఎవరు ఏరోజు రావాలనే విషయమై ముందస్తుగా వారికి ఆర్మీ అధికారులు కాల్ లెటర్స్ పంపించారు.
Updated Date - Nov 11 , 2024 | 12:18 AM