ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కలగానే సచివాలయ సేవలు

ABN, Publish Date - Dec 15 , 2024 | 11:44 PM

ఆ రెండు గ్రామాలకు సచివాలయ సేవలు కలగానే మిగులుతున్నాయి. ప్రభుత్వ సేవలు పొందాలం టే కిలో మీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వస్తోంది.

సచివాలయానికి నోచుకోని పర్తికోట గ్రామం

పర్తికోట, నాయనిచెరువుపల్లెల్లోని

20 గ్రామాలకు నోచుకోని ప్రభుత్వ సేవలు సచివాలయాలకు వెళ్లాలంటే

6 నుంచి 16 కిలో మీటర్లు ప్రయాణం

ఇబ్బందులు పడుతున్న పల్లెవాసులు

ములకలచెరువు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఆ రెండు గ్రామాలకు సచివాలయ సేవలు కలగానే మిగులుతున్నాయి. ప్రభుత్వ సేవలు పొందాలం టే కిలో మీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీంతో ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణ ణాతీతంగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వం ఈ రెండు గ్రామాలకు మొండిచెయ్యి చూపి సచివా లయాలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరి స్ధితి నెలకొంఙది. దీంతో ప్రభుత్వ సేవలు ఈ రెండు గ్రామాలకు దూరంగా మారాయి. ముల కలచెరువు మండలంలోని పర్తికోట, నాయనిచెరు వుపల్లె గ్రామాల్లో ఇంత వరకు సచివాలయాలు ఏర్పాటు కాలేదు. ప్రభుత్వ సేవలు పొందేందుకు పర్తికోట గ్రామ పంచాయతీ ప్రజలు పక్కనున్న దేవళచె రువు సచివాలయానికి నాయనిచెరువుప ల్లె గ్రామ పంచాయతీ ప్రజలు కదిరినాఽథునికోట సచివాల యానికి వెళ్లాలంటే ఆయా గ్రామాల ప్రజలు సుమారు ఆరు నుంచి 16 కిలో మీటర్లు దూరం వెళ్ళాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వమైనా తమ గ్రామా ల్లో సచివా లయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలు అందే లా చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

దేవళచెరువు సచివాలయానికి 12 గ్రామాలు

ములకలచెరువు మండలంలోని దేవళచెరువు గ్రామ పంచాయతీని గత వైసీపీ ప్రభుత్వం రెం డుగా విభజించింది. పర్తికోట గ్రామం కేంద్రంగా కొత్తగా పంచాయతీ ఏర్పాటు చేసింది. పర్తికోట పంచాయతీ పరిధిలో పర్తికోట, ఆవులవారిపల్లె, చిటికివారిపల్లె, కన్నెమడుగువారిపల్లె, దుగుసాని వారిపల్లె, వసంతరాయనిపల్లె, గుడిసెవారిపల్లె, నీరుగట్టువారిపల్లె, గోళ్ళవారిపల్లె, ఎర్రంరెడ్డిగారిప ల్లె, మావిళ్ళవారిపల్లె, మామిడిగుంపులవారిపల్లె ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినా ఇక్కడ సచివాలయం ఏర్పాటు చేయలేదు. దీంతో 12 గ్రామాల ప్రజలు దేవళచెరువు సచివాలయా నికి వెళ్ళాల్సి వస్తోంది. ఎర్రరెడ్డిగారిపల్లె, మావిళ్ల వారిపల్లె గ్రామస్థులు పనుల కోసం దేవళచెరువు సచివాలయం వెళ్ళాలంటే రానూ పోను 16 కిలో మీటర్లు. మిగిలిన గ్రామాల ప్రజలు రానూ, పోనూ ఆరు నుంచి 15 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. 11 గ్రామాల ప్రజలకు బస్సు సౌకర్యం లేదు. పర్తికోట నుంచి దేవళచెరువుకు బి.కొత్తకోట నుంచి తంబళ్లపల్లెకు నడిచే రెండు బస్సులు ఉదయం, సాయంత్ర మాత్రమే ఉండ డంతో దేవళచెరువు సచివాలయం వెళ్లేందుకు ప్రజలు ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఇక వృద్ధులు, దివ్యాంగులు సచివాలయానికి వెళ్లాలం టే సాహసం చేయాల్సి వస్తోంది.

కదిరినాథునికోటకు 8 గ్రామాల ప్రజలు

మండలంలోని నాయనిచెరువుపల్లెలో కూడా గ్రామ సచివాలయం లేదు. దీంతో నాయని చెరు వుపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ని నాయనిచె రువుపల్లె, ఉంగరాళ్లవారిపల్లె, కోటిరెడ్డిగారిపల్లె, వగ్గిపల్లె, గుండాలవారిపల్లె, దాశిరెడ్డిగారిపల్లె, పోకనాటివారిపల్లె, కొత్తిళ్లు గ్రామాలు ఉన్నాయి. ఎనిమిది గ్రామాల ప్రజలు సచివాలయం లేక అవస్ధలు పడుతున్నారు. పంచాయతీ కేంద్రమైన నాయనిచెరువు గ్రామ ప్రజలు కదిరినాఽథునికోట సచివాలయానికి వెళ్ళాలంటే మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న ములకలచెరువుకు వచ్చి మళ్లీ మూడు కిలో మీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్ధితి నెలకొంది. రానూ పోనూ 12 కిలోమీటర్లు ఉంది. కదిరినాథునికోటకు వెళ్ళాలంటే బస్సులు, ఆటోలు ఉండవు. ద్విచక్రవాహనాలు ఉన్న వారిని బ్రతిమ లాడి వెళ్లాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. వృ ద్ధులు, దివ్యాంగులు కదిరినాథునికోట సచివాల యం వెళ్లలేని పరిస్ధితి నెలకొంది. ఇదే పంచాయ తీలోని పోకనావారిపల్లె, గుండాలవారిపల్లె ప్రజలు సచివాలయంకు వెళ్లాలంటే రాను పోను 15 కిలో మీటర్లకు పైగా రాకపోకలు సాగించాలి. ఉంగారా ళ్లపల్లె, వడ్డిపల్లె గ్రామస్ధులు కూడా తొమ్మిది కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి ఉంది.

సచివాలయం వెళ్లాలంటే కష్టాలే..

పర్తికోటలో గ్రామ సచివాలయం లేకపోవడంతో పనుల కోసం దేవ ళచెరువు సచివాలయం వెళ్లేం దు కు బస్సు సౌకర్యం కూడా సరిగా లేదు. ఆటోలను ఆశ్రయిస్తున్నాం. ప్రభుత్వ సేవ లు సరిగా అందడం లేదు. కూట మి ప్రభుత్వమైనా సచివా లయం ఏర్పాటు చేసి కష్టాలు తీర్చాలి.

-సాంబశివారెడ్డి, పర్తికోట, ములకలచెరువు

సచివాలయ సేవలు అందడం లేదు

మా గ్రామంలో సచివాలయం లేకపోవడంతో సేవలు అందడం లేదు. ఇక్కడ ఎందుకు సచివా యం ఏర్పాటు చేయలేదో తెలి యడు. కదిరినాఽథు నికోట సచి వాలయం వెళ్ళాలంటే ఇబ్బందు లు పడుతున్నాం. బస్సులు, ఆ టోలు కూడా లేవు. ములకలచెరు వుకు వచ్చి అక్కడ ఆటోలు బాడు గకు మాట్లాడు కుని వెళ్తున్నాం.

-సరస్వతి, నాయనిచెరువుపల్లె

సచివాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు

పర్తికోట, నాయనిచెరువుపల్లె గ్రా మాల్లో సచివా లయం ఏర్పాటుకు, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపు తాం. గతంలో రెండు గ్రామాల్లో ఎందుకు సచివాలయాలు ఏర్పా టు చేయలేదో రికార్డులు పరిశీలి స్తాం. ఇక్కడ సచివాలయాలు లేని విషయాన్ని ఉన్నతాధికారు ల దృష్టికి కూడా తీసుకెళ్తాం.

-హరినారాయణ, ఎంపీడీవో, ములకలచెరువు

Updated Date - Dec 15 , 2024 | 11:44 PM