ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ABN, Publish Date - Mar 18 , 2024 | 11:29 PM

ఎర్ర చంద నం అక్రమ రవాణా చేస్తున్న ఇ ద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీ సుకుని వాహనంతో సహా 11 దుంగలను స్వాధీనం చేసుకున్న ట్లు అటవీ శాఖ ఫ్లయింగ్‌ స్క్వా డ్‌ పీలేరు డీఎఫ్‌వో జేవీ సుబ్బా రెడ్డి సోమవారం తెలిపారు.

స్మగ్లర్లు, వాహనం, ఎర్రచందనం దుంగలతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది

వాహనం స్వాధీనం

ఇద్దరి అరెస్టు

పీలేరు, మార్చి 18: ఎర్ర చంద నం అక్రమ రవాణా చేస్తున్న ఇ ద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీ సుకుని వాహనంతో సహా 11 దుంగలను స్వాధీనం చేసుకున్న ట్లు అటవీ శాఖ ఫ్లయింగ్‌ స్క్వా డ్‌ పీలేరు డీఎఫ్‌వో జేవీ సుబ్బా రెడ్డి సోమవారం తెలిపారు. సుండుపల్లె అటవీ ప్రాంతం నుంచి పీలేరు మీదుగా చెన్నైకి ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు తాము ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా కల్లూరు గ్రామ జంక్షన్‌ వద్ద కాపుకాచామన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 3.45 గంటల సమయంలో వేగంగా వస్తున్న కారు తాము ఆపినా ఆగకుండా వెళ్లడంతో , వెంబడించగా కల్లూరు ఘాటులోని కొమ్మిరెడ్డిగారిపల్లె క్రాస్‌ వద్ద కారును వదలేసి అందులోని వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా ఇద్దరిని పట్టుకున్నామన్నారు. పట్టుబడినవారు తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరుకు చెందిన జయవేళ్‌, కీలక్కాడుకు చెందిన మురుగన్‌గా తేలిందన్నారు. కారులో 364 కేజీలు బరువున్న 11 ఎర్రచందనం దుంగలు లభించాయన్నారు. దీంతో స్మగ్లర్లు, కారుతో సహా వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. పారిపోయిన మిగిలిన వారి కోసం కూడా గాలింపు జరుతున్నామన్నారు. ఈ దాడిలో తనతోపాటు ఎఫ్‌ఆర్‌వో వెంకటరమణ, ఎఫ్‌బీవో ప్రతాప్‌, సిబ్బంది చరణ్‌, తదితరులు పాల్గొన్నట్లు ఆయన వివరించారు.

Updated Date - Mar 18 , 2024 | 11:29 PM

Advertising
Advertising