మురుగు ఇలా.. పరిశుభ్రత ఎలా..?
ABN, Publish Date - Nov 07 , 2024 | 11:47 PM
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వభావ్ స్వచ్ఛత - సంస్కార్ స్వచ్ఛత అనే కార్యక్ర మాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి ప్రారంభించి నా గ్రామాల్లో ఇంకా ప్రజలకు మురుగు కష్టాలు తప్పడంలేదు.
గామాల్లో లోపించిన పారిశుధ్యం
కనిపించని స్వఛ్చతహీ సేవా
పూడిపోయిన మురుగు కాలువలు
దోమలు అధికమై జ్వరాల భారీన పడుతున్న ప్రజలు
పెద్దతిప్పసముద్రం నవంబర్ 7 (ఆంద్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వభావ్ స్వచ్ఛత - సంస్కార్ స్వచ్ఛత అనే కార్యక్ర మాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి ప్రారంభించి నా గ్రామాల్లో ఇంకా ప్రజలకు మురుగు కష్టాలు తప్పడంలేదు. ఆయా గ్రామాల్లో పంచాయతీ సర్పంచలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రీన అం బాసిడర్లు మురుగునీటి కాలువలను శుభ్రం చేసి కాలువల్లో బ్లీచీంగ్ చల్లాల్సి ఉంది అయితే స్వఛ్చతా హే సేవా కార్యక్రమాలను తూతూ మం త్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయా గ్రామాల్లో మురు గు కాలువల్లో ఉన్న చెత్తా చెదారం కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దోమలు అధిక మై ప్రజలు రోగాల భారీన పడుతున్నారు.
ప్రధాన కాలువలు పూడుకుపోయాయి
మండలంలోని అనేక గ్రామాల్లో ఉన్న ప్రధాన మురుగు కాలువలు పూర్తిగా పూడుకు పోవడం తో మురుగు నిల్చి దోమలు అధికమై ప్రజలు జ్వరాల భారీన పడి ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ముఖ్యంగా రంగసముద్రం పంచాయతీ విసనకర్రవాండ్లపల్లెలో ఉన్న ప్రదాన మురుగు కాలువైన ఇరిగేషన కట్టుకాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో కట్టుకాలువ పూర్తిగా కం పచెట్లతో మూసుకుపోవడంతో దుర్గంధం వెదజ ల్లుతోంది. కాగా కట్టుకాలువ పక్కనే పంచాయతీ తాగునీటి బోరు ఉండడంతో కాలువలోని మురు గునీరు బోరులోకి కలుషితం అవుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
పీటీఎంలో కొరవడిన పారిశుధ్యం
మండల కేంద్రమైన పీటీఎంలోని పాత పం చాయతీ కార్యాలయం సమీపంలో మురుగునీటి కాలువ పూర్తిగా పూడుకు పోయి దుర్గంధం వెదజల్లుతోంది మండల కేంద్రంలోనే పారిశుధ్యం ఇలా ఉంటే ఇక గ్రామీణా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఓ వైపు గ్రామాలను స్వఛ్ఛ గ్రామాలను చేయాలనే ఉద్దేశ్యం ఇలా నీరు గారుతుంటే ప్రభుత్వ లక్ష్యం ఎప్పుడు నెరవేరు తుందని పలువురు వాపోతున్నారు.
జ్వరాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండడంతో గ్రామాల్లోని మురుగు కాలువలు పూర్తిగా నిండిపోయి దుర్గం ధం వెదజల్లుతున్నాయి. దీంతో దోమలు అధికం గా ఉండడంతో రంగసముద్రం పంచాయతీ విస నకర్రవాండ్లపల్లెలో అనేక మంది జ్వరాల బారీన పడుతున్నారు. కనీసం ఇప్పటికైనా పంచాయతీ అధికారులు ఈ కాలువపై దృష్టి సారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
ముఖ్యంగా పంచాయతీల్లోని సచివాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని పంచాయతీ కార్య దర్శులు వాపోతున్నారు. అన్ని పంచాయతీలకు పూర్తి స్థాయిలో లేక పోవడం నాలుగైదు పంచా యతీలకు ఒకే కార్యదర్శి ఉండడంతో పంచాయతీ సమస్యలపై కార్యదర్శులు దృష్టి సారించేందుకు వీలు లేకుండా పోయిందని, పంచాయతీ కార్యద ర్శులను పూర్తి స్థాయిలో నియమించి ఆయా పం చాయతీల్లో పారిశుధ్యంపై దృష్టిని కేంద్రీకరిం చా లని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దీనిపై జిల్లా అదికారులు స్పందించి కార్యదర్శులను ని యమిస్తే పంచాయతీలలో పారిశుధ్య సమస్యలు నివారించవచ్చని పలువురు పేర్కొంటున్నారు.
Updated Date - Nov 07 , 2024 | 11:47 PM