తంబళ్లపల్లెలో విద్యుత సిబ్బంది కొరత
ABN, Publish Date - Oct 18 , 2024 | 11:43 PM
తంబళ్లపల్లె మండలంలో గ్రామాలకు సరిపడా విద్యుత శాఖ సిబ్బంది లేకపోవడంతో విద్యుత సమస్యలు సకాలంలో పరిష్కారం కాక వినియోగదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇబ్బంది పడుతున్న వినియోగదారులు, రైతులు
తంబళ్లపల్లె, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తంబళ్లపల్లె మండలంలో గ్రామాలకు సరిపడా విద్యుత శాఖ సిబ్బంది లేకపోవడంతో విద్యుత సమస్యలు సకాలంలో పరిష్కారం కాక వినియోగదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తంబళ్లపల్లె మండలంలో 21 పంచాయతీలు ఉండగా తంబళ్లపల్లె, కన్నెమడుగు, గోపిదిన్నె, కోసువారిపల్లె, కుక్కరాజుపల్లెల్లో 33/11 కేవి విద్యుత ఉపకేంద్రాలు ఉన్నాయి. ఈ ఉపకేంద్రాల పరిధిలో తంబళ్లపల్లె, కన్నెమడుగు, రేణుమాకులపల్లె, కుక్కరాజుపల్లె, కోటకొండ, గుండ్లపల్లె, దిగువపాళ్యం, గంగిరెడ్డిపల్లె, పంచాలమర్రి, గోపిదిన్నె, కొటాల, జుంజురపెంట కోసువారిపల్లె డిస్ర్టిబ్యూషన్లు ఉన్నాయి. వాటికి లైనమెన్లు, ఏఎల్‌ఎం (అసిస్టెంట్ లైనమెన)లు, జేఎల్‌ఎం (జూనియర్ లైనమెన)లు కలిపి మొత్తం 13 మందికి పైగా విద్యుత సిబ్బంది అవసరం. అయితే తంబళ్లపల్లె టౌన, రేణుమాకులపల్లె, కోటకొండ, కుక్కరాజుపల్లె, కోసువారిపల్లెకు ముగ్గురు (ఇద్దరు గ్రేడ్-2), గోపిదిన్నెకు(గ్రేడ్-2) మాత్రమే సిబ్బంది ఉన్నారు. కన్నెమడుగు, పంచాలమర్రి, గుండ్లపల్లె, తంబళ్లపల్లె రూరల్, కొటాల డిస్ర్టిబ్యూషనలకు సిబ్బంది లేరు. దీంతో ఆయా గ్రామాల్లో విద్యుత సమస్యలు వస్తే ఎవరికి చెప్పాలో తెలియక వినియోగదారులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది లేని గ్రామాల్లో సమస్యలు తలెత్తితే ఇతర గ్రామాల లైనమెన్లు కానీ, విద్యుత ఉప కేంద్రాల డ్యూటీ ఆపరేటర్లు వెళ్లి సమస్యను పునరుద్ధరించాల్సి వస్తోంది. దీంతో విద్యుత సరఫరాలో తీవ్ర జాప్యం కలుగుతోంది. ముఖ్యం గా తంబళ్లపల్లె టౌన, రూరల్‌కు కలిపి ఒక లైనమెన, ఒక ఏఎల్‌ఎం, ఒక జేఎల్‌ఎం ఉండాల్సి ఉండగా.. ఒక లైనమెన మాత్ర మే ఉన్నారు. దీంతో తంబళ్లపల్లె టౌన, రూరల్‌లో విద్యుత లైన్ల లో సమస్యలు వచ్చినపుడు సిబ్బంది ఒక్కరే ఉండటంతో పునరుద్ధరించడంలో ఆలస్యం అవుతోంది. విద్యుత ఉన్నతాధికారు లు స్పందించి మండలానికి అవసరమైన సిబ్బందిని కేటాయించాలని వినియోగదారులు, రైతులు కోరుతున్నారు.
సకాలంలో సమస్యలను పరిష్కరిస్తున్నాం
- ట్రాన్సకో ఏఈ, శేషు. తంబళ్లపల్లె
తంబళ్లపల్లె మండలంలో సిబ్బందిలేని గ్రామాల్లో విద్యుత సమస్యలు తలెత్తితే వినియోగదారులకు ఇబ్బంది కలుగకుండా అం దుబాటులో ఉన్న లైనమెన్లతో సమస్యలను సకాలంలో పరిష్కరిస్తున్నాం. మండలంలో ఏయే గ్రామాలకు సిబ్బంది అవసర మో ఉన్నతాధికారులకు తెలియచేశాం. త్వరలో జరిగే బదిలీలలో తంబళ్లపల్లె మండలానికి పూర్తి స్థాయిలో సిబ్బంది వస్తారు.
Updated Date - Oct 18 , 2024 | 11:43 PM