విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:57 PM
విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించాలని ఏఐటీ యూసీ అనుబంధ ఏపీ విద్యుత మీటరు రీడర్స్ యూనియన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి డిమాండ్ చేశారు.
కడప సెవెనరోడ్స్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించాలని ఏఐటీ యూసీ అనుబంధ ఏపీ విద్యుత మీటరు రీడర్స్ యూనియన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి డిమాండ్ చేశారు. శుక్రవారం కడపలో ని సూపరింటెండెంట్ ఇంజనీరు కా ర్యాలయం ఎదుట ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ విద్యుత మీటరు రీడర్లు సంస్థను నమ్ముకుని గత 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారన్నారు. వారు పలు సమస్యలతో ఇబ్బం దిప డుతున్నారన్నారు. ఇందులో వేతన చె ల్లింపు సమస్య ఒకటన్నారు. వారికి ఎస్ర్కో అకౌంటు ద్వారా జీతాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబరు 2024 నుంచి ఎస్ర్కో అకౌంటు ద్వారా జీతాలు చెల్లించాలన్నారు. ఈ విధా నాన్ని ప్రతి జిల్లాలో తక్షణం అమలు చేయాలని పలుమార్లు అధికారులకు వినతిపత్రాల ద్వారా తెలిపామని, అయినప్పటికీ ఏ మా త్రం చలనం లేదన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఏఐటీ యూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, బాదుల్లా, మద్దిలేటి కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
Updated Date - Nov 29 , 2024 | 11:57 PM