ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ట్రిపుల్‌ఐటీ ఘటనపై ఎస్పీ సీరియస్‌

ABN, Publish Date - Sep 23 , 2024 | 11:33 PM

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలోని క్యాంటీన్‌ల వద్దకు టీడీపీ నాయకులు వెళ్లి ఖాళీ చేయాలని కోరిన ఘటనపై ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు సీరియస్‌ అయ్యారు. దీనిపై ఆర్కేవ్యాలీ సీఐ నాగరాజు, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డితో మాట్లాడారు. అసలేం జరిగిందన్న వివరాలను ఆరాతీశారు.

ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ గుప్తతో సమావేశం అయిన సీఐ నాగరాజు, ఎ్‌సఐ తదితరులు

9 మంది బైండోవర్‌

వేంపల్లె, సెప్టెంబరు 23: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలోని క్యాంటీన్‌ల వద్దకు టీడీపీ నాయకులు వెళ్లి ఖాళీ చేయాలని కోరిన ఘటనపై ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు సీరియస్‌ అయ్యారు. దీనిపై ఆర్కేవ్యాలీ సీఐ నాగరాజు, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డితో మాట్లాడారు. అసలేం జరిగిందన్న వివరాలను ఆరాతీశారు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐ, ఎస్‌ఐలు ట్రిపుల్‌ఐటీకి వెళ్లి డైరెక్టర్‌ కుమారస్వామి గుప్త, ఏఓ పెనుగొండ రవికుమార్‌, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. శాంతిభద్రతల సమస్య ఉందని భావిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని డైరెక్టర్‌కు తెలిపారు. కాగా ట్రిపుల్‌ఐటీలో టీడీపీ నాయకులు ఎప్పుడు వచ్చారు, ఎక్కడెక్కడకు వచ్చారు అన్న వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ వ్యవహారంలో తొమ్మిది మంది టీడీపీ నేతలపై బైండోవర్‌ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ట్రిపుల్‌ఐటీలోకి వెళ్లాలంటే అధికారుల అనుమతి తీసుకుని వెళ్లాలని టీడీపీ నాయకులకు సీఐ ఈ సందర్భంగా సూచించారు. కాగా.. ట్రిపుల్‌ఐటీకి ఎవరైనా గుంపులుగా గాని, కొత్తవ్యక్తులు వచ్చినపుడు అనుమతి ఉంటేనే లోపలికి పంపాలని డైరెక్టర్‌ కుమారస్వామి గుప్త, ఏఓ రవికుమార్‌లు సెక్యూరిటటీ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం సెక్యూరిటీ వారితో ఏఓ సమావేశం నిర్వహించారు. ఎవ్వరు వచ్చినా ఉన్నతాధికారులకు తెలియజేసి వారి అనుమతి తీసుకున్నాకే లోపలికి పంపించాలని చెప్పారు.

సమాచారం తెలుసుకునేందుకే..

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో క్యాంటీన్‌ ఎలా నిర్వహించుకుంటున్నారు, ఏమేమి అవసరం, ఎంత పెట్టుబడి కావాలి అన్న సమాచారం తెలుసుకునేందుకు టీడీపీ నాయకులు వెళ్లారని టీడీపీ మండల పరిశీలకుడు అజ్జుగుట్ట రఘునాథరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ట్రిపుల్‌ఐటీకి వెళ్లిన తమ నాయకులు ఏ క్యాంటీన్‌ వద్ద దౌర్జన్యం చేయలేదని, దురుసుగా వ్యవహరించలేదని అన్నారు. వివరాలు తెలుసుకుని క్యాంటీన్‌లోనే టీ తాగి వచ్చారని తెలిపారు.

Updated Date - Sep 23 , 2024 | 11:33 PM