ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Annamaiah project ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

ABN, Publish Date - Sep 18 , 2024 | 11:36 PM

వరద నష్ట పరిహారం చెల్లింపులో గత ప్రభుత్వం వివక్ష పాటించిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి తమను ఆదుకోవాలని అన్నమయ్య ప్రాజెక్టు ముంపుబాధిత గ్రామాల ప్రజలు సబ్‌కలెక్టరు వైఖోం నిధియాదేవికి విన్నవించారు.

అన్నమయ్య’ బాధితులతో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌ నిధియాదేవి

సబ్‌కలెక్టర్‌కు ‘అన్నమయ్య’ బాధితుల వినతి

రాజంపేట, సెప్టెంబరు 18: వరద నష్ట పరిహారం చెల్లింపులో గత ప్రభుత్వం వివక్ష పాటించిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి తమను ఆదుకోవాలని అన్నమయ్య ప్రాజెక్టు ముంపుబాధిత గ్రామాల ప్రజలు సబ్‌కలెక్టరు వైఖోం నిధియాదేవికి విన్నవించారు. బుధవారం ఆమె అన్నమ్యయ్య బాధిత మందపల్లె, శేషమాంబపురం, పులపత్రూరు, గుండ్లూరు, తాళ్లపాక గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మందపల్లె టీడీపీ నేత కొండా శ్రీనివాసులు, ఇతర గ్రామాల ప్రజలు మాట్లాడుతూ మందపల్లె, తొగురుపేట, శేషమాంబపురం, గుండ్లూరు గ్రామాల్లో ఎక్కువ ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందని తెలిపారు. అయితే, వైసీపీకి అనుకూలంగా ఉన్న పులపత్తూరు లాంటి గ్రామాల ప్రజలకు మాత్రమే నష్టపరిహారం అందిందని మిగిలిన గ్రామాలపై వివక్ష చూపారని వాపోయారు. వరద కారణంగా తమ గ్రామంలో పలువురు ప్రాణాలు కోల్పోయారని మందపల్లె వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వర్షాలు మొదలయ్యాయని, వరద వస్తే తమ గ్రామంలో మళ్లీ ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయిని ఆందోళన వ్యక్తం చేశారు. వెను వెంటనే రక్షణగోడలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ గ్రామంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని, పంటనష్టం, ఆస్తినష్టం, ప్రాణనష్టం, పశు నష్టం అన్నిరకాల నష్టం జరిగినా తమకు సరైన న్యాయం జరగ లేదన్నారు. తమకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రాలు సమర్పించారు.

మినీ గురుకులంలో సబ్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

రైల్వేకోడూరు(రూరల్‌): మండలంలోని గిరిజన మినీ గురుకుల పాఠశాలను బుధవారం సాయంత్రం రాజంపేట సబ్‌ కలెక్టర్‌ నిధియాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రైల్వేకోడూరు ఆర్‌ఐ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2024 | 11:36 PM

Advertising
Advertising