మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
ABN, Publish Date - Oct 12 , 2024 | 12:56 AM
మానవ అక్రమ రవాణాను అరిక ట్టాలని మదనపల్లె పట్టణంలో ప్ర జా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
మదనపల్లె అర్బన, అక్టోబరు 11: మానవ అక్రమ రవాణాను అరిక ట్టాలని మదనపల్లె పట్టణంలో ప్ర జా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు. గ్రామజ్యోతి సొసైటీ ఆధ్వర్యం లో శుక్రవారం వెలుగు ప్రత్యేక స్కూ ల్‌లో రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు. ముందుగా మానవ అక్రమ రవాణాకు గురైన వారి కొర కు, హత్యలకు బలైనవారి కోసం పూలతో నివాళులర్పిం చి క్యాండిల్స్ వెలిగించి మౌనం పాటించారు. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అందరూ అవగాహన పెంచు కోవాలని పేర్కొన్నారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఉపాధి, సినిమా అవకాశాల పేరుతో అక్రమ రవాణా అధికంగా ఉందని, అరికట్టే దిశగా చర్యలు చేపట్టడంతోపాటు అవగాహన కల్పించాల న్నారు. మహిళలను బలవంతపు వ్యభిఛారంలోకి దించే ముఠాల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామజ్యోతి సొసైటీ సుభద్ర, వెలుగు ఉదయ మోహనరెడి, భాగ్యలక్ష్మీ సంస్థ మునిరత్నం, మలమహానాడు అధ్యక్షుడు యమల సుదర్శనం, సీపీఎం శ్రీనివాసులు, సీనియర్ సిటిజన్స మునిగోపాల్ కృష్ణ, పియర్స్ సంస్థ వేమనారాయణ, రీడో సంస్థ ఈశ్వరయ్య, పీపుల్ రూరల్ డెవలప్ మెంట్ ఎడ్యుకేషన సొసైటీ అధ్యక్షుడు బొజ్జప్ప, ఫోర్డు సంస్థ లలితమ్మ, చైతన్య సేవాసంస్థ కవితారాణి, హెల్పింగ్ మైండ్స్ సంస్థ అబూబక్కర్ పాల్గొన్నారు.
Updated Date - Oct 12 , 2024 | 12:56 AM