ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అక్రమ కట్టడాలు నిర్మిస్తే కఠిన చర్యలు : తహసీల్దార్‌

ABN, Publish Date - Dec 04 , 2024 | 11:59 PM

పులివెందుల పట్టణంలోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టడాలు నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌ తెలిపారు.

ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు నాటిన రెవెన్యూ అధికారులు

పులివెందుల టౌన, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పులివెందుల పట్టణంలోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టడాలు నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులివెందుల గ్రామ పొలంలోని రాణి తోపు వద్ద గల 462, 463 సర్వేనెంబరులోని స్థలం ప్రభుత్వ స్థలం అని, అందులో ఎవరు నిర్మాణాలు చేపట్టినా క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పులివెందుల పట్టణంలోని క్రిష్ణుడి దేవస్థానం సమీపంలోని పోలేపల్లి గ్రామ పరిధిలోని సర్వేనెంబరు 29లో గల భూమి ప్రభుత్వ అన్నారు. ఆ రెండు స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఈ స్థలాల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

Updated Date - Dec 04 , 2024 | 11:59 PM