ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ర్యాగింగ్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవు

ABN, Publish Date - Aug 30 , 2024 | 11:53 PM

విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలికిరి సీఐ కె. రెడ్డిశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సూచనలిస్తున్న సీఐ రెడ్డిశేఖర్‌ రెడ్డి

విద్యార్థుల కదలికలపై మానిటరింగ్‌ కమిటీ నిఘా ఉంచాలి

కలికిరి, ఆగస్టు 30: విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలికిరి సీఐ కె. రెడ్డిశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. కళాశాలకు చెం దిన ఒక విద్యార్థి గురువారం మైదుకూరులో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ర్యాగింగ్‌ కారణంగానే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఐ శుక్రవారం కళాఽశాలలో విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కళాశాల ర్యాగింగ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించి విద్యార్థులపై నిఘా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర రావు, హెచఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈవ్‌టీజింగ్‌ పైనా చర్యలు తీసుకోండి

కళాశాలల్లో ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌ల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మాధవ్‌ డిమాండ్‌ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్‌ విద్యార్థి ప్రవీణ్‌కు న్యాయం జరగాలని స్థానిక ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఐ రెడ్డిశేఖర్‌ రెడ్డి, ప్రిన్సి పాల్‌ వెంకటేశ్వర రావులకు వినతి పత్రం అందజేశారు.

Updated Date - Aug 30 , 2024 | 11:53 PM

Advertising
Advertising