ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇసుక దందాకు పాల్పడితే కఠిన చర్యలు

ABN, Publish Date - Sep 03 , 2024 | 11:21 PM

ఎవరైనా ఇసుక దందాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మల మడుగు ఆర్డీవో శ్రీనివాస్‌ తెలిపారు.

జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాస్‌

ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌కు సిఫారసు

ఏటూరు ఇసుక రీచ్‌ను పరిశీలించిన ఆర్డీవో

కొండాపురం/వీరపునాయునిపల్లె, సెప్టెంబరు 3: ఎవరైనా ఇసుక దందాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మల మడుగు ఆర్డీవో శ్రీనివాస్‌ తెలిపారు. ఏటూరు ఇసుక రీచ్‌లో ఇసుక దందాపై ఆంధ్రజ్యోతిలో మంగళవారం ‘వీళ్లూ.. మార రంతే’ పేరుతో కథనం ప్రచురితం అయింది. దీంతో మంగళ వారం సాయంత్రం ఏటూరు ఇసుకరీచ్‌ను ఆర్డీవో పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అదనపు లోడింగ్‌కు డబ్బులు వసూలుచేసినా, ఇసుక అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గేటు వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఇప్పటికే ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌కు సిఫారసు చేశా మన్నారు. ఇసుక రవాణా పారదర్శకంగా జరగా లని అధికారులను ఆదేశించారు. రెండుమూడు రోజుల్లో ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ అయిన వాహనాలను మాత్రమే ఇసుక సరఫరాకు అనుమతిస్తామ న్నారు. ప్రస్తుతం కొండాపురం, తాళ్లప్రొద్దుటూరు సచివాలయాల వద్ద మాత్రమే ఇసుక బుకింగ్‌కు అవకాశం ఉందన్నారు. త్వరలో ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశ పెడుతోందని, దీనిద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఇసుకను బుక్‌ చేసుకొనే అవకాశం ఉంటుంద న్నారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్‌ వద్ద కూపన్లను ఆర్డీవో తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ మాధవకృష్ణారెడ్డి, డిప్యూటీ తహశీల్దార్‌ రాజేశ్వరమ్మ, ఆర్‌ఐ ఆనందరావు పాల్గొన్నారు.

ఇసుక స్టాక్‌ పాయింట్‌ను పరిశీలించిన మైనింగ్‌ ఏడీ

వీరపునాయునిపల్లె మండలం సంగమేశ్వరం సమీపంలోని ఇసుక స్టాక్‌ పాయింట్‌ వద్దఅధికార పార్టీ నాయకుల దందాపై మంగళవారం ఆంధ్రజ్యోతిలో కథనం రావడంతో అధికారులపై కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. దీంతో ఇసుక స్టాక్‌పాయింట్‌ వద్దకు మైనింగ్‌ ఏడీ రవిప్రసాద్‌, తహశీల్దార్‌ లక్ష్మిదేవి, ఆర్‌ఐ విమలమ్మ, ఎంపీడీఓ చంద్రశేఖర్‌రెడ్డి వెళ్లి పరిశీలించారు. ఏడీ రవిప్రసాద్‌ మాట్లాడుతూ స్టాక్‌ పాయింట్‌ను పరిశీలించామని, స్టాక్‌పాయింట్‌ వద్ద 156 టిప్పర్లు ఉన్నాయని అన్నారు. వాటికి లోడింగ్‌ చేయించి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి రెండు మూడు రోజుల్లో ఈ క్వారీపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. స్టాక్‌ పాయింట్‌ వద్దకు ఇసుక కోసం వినియోగదారులు రాలేదని, లోకల్‌ నాయకుల జోక్యంతో ఇసుక తరలిస్తున్నారని అన్నారు. స్టాక్‌ పాయింట్‌లో మిగిలి ఉన్న ఇసుకను హౌసింగ్‌కు వాడేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Sep 03 , 2024 | 11:21 PM

Advertising
Advertising