ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్హులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం

ABN, Publish Date - Sep 09 , 2024 | 12:05 AM

మదనపల్లె సిరికల్చర్‌కాలనీలో అన ర్హులకు కేటాయించిన రీలింగ్‌ యూ నిట్ల స్థలాలను రద్దు చేసి, అర్హులకు న్యాయం చేసే వరకు పోరాటం తప్పదని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత డిమాండ్‌ చేశారు.

మదనపల్లె బైపాస్‌రోడ్డులో రాస్తారోకో చేస్తున్న బహుజన యువసేన నాయకులు

మదనపల్లె టౌన, సెప్టెంబరు 8: మదనపల్లె సిరికల్చర్‌కాలనీలో అన ర్హులకు కేటాయించిన రీలింగ్‌ యూ నిట్ల స్థలాలను రద్దు చేసి, అర్హులకు న్యాయం చేసే వరకు పోరాటం తప్పదని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక సిరికల్చర్‌ కాలని వద్ద బైపాస్‌రోడ్డులో బహుజన యువ సేన నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పునీత మాట్లాడుతూ ఆరు నెలల క్రితం సిరికల్చర్‌ కాలనీలో 11 మందికి రీలింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు స్థలాలు కేటా యించారని, వారిలో ఐదుగురు అనర్హులు ఉన్నారన్నారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం మద్దతుతో అక్రమంగా అనర్హులు రూ.కోట్ల విలువైన స్థలాలు కాజేశారని ఆరోపించారు. ఈ విషయమై ఆరు నెలలుగా పోరాడుతున్నా, సంబంధిత అధికారులు పట్టించుకోలేద న్నారు. డీఎస్‌వో ఆదేశించినా ఇక్కడ అనర్హులు పనులు చేస్తుండటంపై నిరసనగా రాస్తా రోకో చేయాల్సి వచ్చిందన్నారు. కాగా రాస్తారోకోతో బైపాస్‌రోడ్డులో ఇరువైపు వాహనాలు నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న టు టౌన సీఐ రామచంద్ర, ఎస్‌ఐ రహీముల్లా అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పి రాస్తారోకో విరమింపజేశారు. ఈ కార్యక్ర మంలో చేనేత కార్మికులు శ్రీనివాసులు, షెహెనషా, ప్రవీణ్‌, బహుజన యువసేన నాయ కులు జగదీష్‌, ఆది, శశికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 12:06 AM

Advertising
Advertising