ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లా స్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ABN, Publish Date - Oct 29 , 2024 | 11:44 PM

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ విద్యా సాగర్‌నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీల్లో మదనపల్లె విజయభారతి హైస్కూల్‌ విద్యార్థులు ప్రతిభ చూపారని ప్రిన్సిపాల్‌ ఎన.సేతు పేర్కొన్నారు.

మదనపల్లె టౌన, అక్టోబరు 29(ఆం ధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ విద్యా సాగర్‌నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీల్లో మదనపల్లె విజయభారతి హైస్కూల్‌ విద్యార్థులు ప్రతిభ చూపారని ప్రిన్సిపాల్‌ ఎన.సేతు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మా ట్లాడుతూ రెండు రోజుల క్రితం రాయచోటిలో పోలీసుశాఖ ఆధ్వ ర్యంలో నిర్వహించిన పోటీల్లో తమ పాఠశాలకు చెంది న షణ్ముఖప్రియ ప్రథమ బహుమతిగా రూ.5వేలు సర్టిఫి కెట్‌ అందుకున్నారన్నారు. అలాగే రెడ్డిసుజిత వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి రూ.3వేలు నగదు బహుమతి సర్టిఫికెట్‌ను ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు చేతుల మీదుగా అందుకున్నా రన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను అభినందించారు.

పీలేరులో: జిల్లా స్థాయి వక్తృత్వ పోటీల్లో పీలేరులోని వీఎస్‌ఎన సిద్దార్ధ ఒలింపియాడ్‌లో 9వ తరగతి చదువుతున్న సనా ముబారక్‌ విశేష ప్రతిభ చూపి ద్వితీయ స్థానం సాధించింది. రాయచోటిలోని తన కార్యాలయంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయు డు మంగళవారం విద్యార్థిని సనా ముబారక్‌కు అవార్డు అందించారు. విద్యార్థిని వీఎస్‌ఎన సంస్థల అధినేత్రి మాధవి, ప్రిన్సిపాల్‌ సురేశ, ఉపాధ్యాయులు అభినందించారు.

కలికిరిలో: కలికిరి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వి. హరితకు పోలీసు ప్రశంసా పత్రం లభించింది. ‘నేరాల నియంత్రణలో యువత భాగస్వామ్యం’ అనే అంశంపై జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థినుల మధ్య జరిగిన వక్తృత్వ పోటీల్లో హరిత మూడో స్థానంలో నిలిచింది. ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హరితకు ఎస్పీ విద్యాఽసాగర్‌ నాయుడు ప్రశంసా పత్రం అందజేసి అభినంద నలు చెప్పారు. పాఠశాల ఉపాధ్యాయినులు కూడా హరితను అభినందించారు.

Updated Date - Oct 29 , 2024 | 11:44 PM