ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘భూకబ్జాదారులపై చర్యలు తీసుకోండి’

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:26 AM

దళితుడి భూమిని ఆక్రమించేందుకు కుట్రలు పన్ని దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్న వారి పై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసు కోవాలని ఏపీ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి ఇల్లూరి సురేశ డిమాండ్‌ చేశారు.

కడప ఎన్టీఆర్‌ సర్కిల్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): దళితుడి భూమిని ఆక్రమించేందుకు కుట్రలు పన్ని దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్న వారి పై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసు కోవాలని ఏపీ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి ఇల్లూరి సురేశ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన బాధితుడు, ఎమ్మార్పీఎస్‌ నాయకులతో కలిసి తహసీల్దారుకు శుక్రవారం వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగర పరిధిలోని రామరాజుపల్లె పొలంలో దళితుడైన శేఖర్‌బాబుకు పూర్వీకుల నుంచి 70 సెంట్ల స్థలం సంక్రమించిందన్నారు. ఈ విసయమై గతంలో రెవె న్యూ అధికారులు సైతం ధ్రువీకరించారన్నారు. ఆ స్థలంపై కన్నేసిన ఆక్రమణదారులు స్థలాన్ని కబ్జా చేసి బాధితుడిని అక్కడి నుంచి తరిమి వేసేందుకు ప్రణాళికలు రూపొందిం చారన్నారు. అన్నిసాక్ష్యాలతో తహసీల్దారుకు సంబంధిత పత్రాలను సమర్పించామన్నారు. ఈ సంఘటనలో దౌర్జన్యకారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 09 , 2024 | 12:26 AM