శిశువుల ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించాలి
ABN, Publish Date - Nov 07 , 2024 | 11:41 PM
శిశువుల ఆరోగ్యం పట్ల శిశుగృహాల నిర్వాహకులు శ్రద్ధ వహించాలని డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబాపక్రుద్దీన్ పేర్కొన్నారు.
కడప రూరల్, అక్టోబర్ 7 (ఆంధ్రజ్యోతి) : శిశువుల ఆరోగ్యం పట్ల శిశుగృహాల నిర్వాహకులు శ్రద్ధ వహించాలని డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబాపక్రుద్దీన్ పేర్కొన్నారు. గురువారం శిశు రక్షణ దినోత్సవం సందర్భంగా కడప నగరం కొండాయపల్లెలోని శిశుగృహాన్ని సందర్శించి న్యాయవిజ్ఙాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ శిశువుల పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. సకాలంలో వ్యాక్సిన్లు వేయించాలన్నారు. పిల్లలకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ బాలల సంరక్షణ కోసం స్నేహపూర్వక న్యాయసేవల పథకం 2015, లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నెంబర్ 15100 తదితర అంశాలను వివరించారు.
Updated Date - Nov 07 , 2024 | 11:41 PM