ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్హులైన పేదలందరికీ భూముల సాధనే లక్ష్యం

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:19 AM

పేదలకు భూముల సాధనే లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈశ్వరయ్య పేర్కొన్నారు.

కడప ఆర్డీఓకు వినతిపత్రం అందిస్తున్న సీపీఐ నాయకులు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈశ్వరయ్య

కడప ఎన్టీఆర్‌ సర్కిల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పేదలకు భూముల సాధనే లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈశ్వరయ్య పేర్కొన్నారు. జిల్లాలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలకు సాగు భూమి, ఇంటి స్థలాలు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముట్టడిలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు పాలక ప్రభుత్వాలు అర్హులైన వారికి రెండు ఎకరాల సాగు భూమి, ఇంటి స్థలం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఓట్లు పొంది అధికారంలోకి రాగానే విస్మరించడం బాధాకరమన్నారు. వైసీపీ పాలనలో ఆరు విడతల భూ పంపిణీలో కూడా భూమి దక్కని వారు చాలా మంది ఉన్నారన్నారు. అసైనమెంటు కమిటీ నిర్వహించి అర్హులైన పేదలకు భూ పంపిణీ చేపట్టకపోవడం విచారకరమన్నారు. అనంతరం కడప ఆర్డీఓ జాన ఎర్వినకు పేదలు తీసుకువచ్చిన దరఖాస్తులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్‌ నాయక్‌, సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ, కమలాపురం ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్‌, ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్‌నాయక్‌, అధ్యక్షుడు బ్రహ్మం, డీహెచపీఎ్‌స జిల్లా ప్రధాన కార్యదర్శి మునెయ్య, నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 12:19 AM