ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వంతెన రాదు.. కష్టాలు తీరవు..!

ABN, Publish Date - Nov 02 , 2024 | 11:40 PM

పెద్దమండ్యం సమీపంలో కుషావతినదిపై బ్రిడ్జి నిర్మాణం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గత వర్షాలకు కుషావతినది ఉధృతి ప్రవాహం దాటుతున్న విద్యార్థుల కష్టాలు (ఫైల్‌ ఫోటో)

పెద్దమండ్యం, నవంబరు2(ఆంధ్రజ్యోతి): పెద్దమండ్యం సమీపంలో కుషావతినదిపై బ్రిడ్జి నిర్మాణం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్ల క్రితం పెద్దమండ్యం- గుర్రంకొండ రహదారి డబుల్‌ తారురోడ్లు అభివృద్ధి పనుల్లో భాగంగా పెద్దమండ్యం కుషావతినదిపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అప్పటి అధికారులు నిర్లక్ష్య వైఖరికి నిధులు వెనక్కి వెళ్లాయి. దశాబ్దా లుగా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు గ్రామ సభల్లో, మండ ల సర్వసభ్య సమావేశాల్లో వందల సార్లు విన్నవించి వినతి పత్రాలు ఇచ్చినా? స్థానికులు పలు మార్లు నిరసనలు తెలిపినా? బ్రిడ్జి మాత్రం రాలేదు. వర్షకాలంలో ఈ నది ఉధృతికి ప్రయాణికులు కష్టాలు చవిచూడాల్సిందే. ఆ సమయంలో మండల అధికారులు అక్కడికి చేరుకొని ప్రమాద బోర్డులు ఏర్పాటు చేస్తారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఆ సమస్యను కూడా వదలివేయడం ఆనావాయితిగా మారిపోతోంది. పెద్దమండ్యం ప్రజలకు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అందని దాక్ష పండులాగా మారింది. వర్షకాలం వస్తే పెద్దమండ్యం, సి.గొల్లపల్లి, గాలివీడు, మదనపల్లి ప్రాంత ప్రజలు వర్షం కురిస్తే కుషావతినది నీటి ఉఽధృతికి ప్రయాణాలు, పాఠశాలలు, అత్యవసర సేవల ను నిలిపివేయాల్సిందే.. అత్యవసర వేళల్లో ఈ నది ప్రవాహంలో జీపును దాటిస్తూ కలిచెర్లకు చెందిన ఓ వ్యక్తి నీటి ఉధృతికి కొట్టుకు పోయి ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ఎందరో రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. ప్రతి వర్షకాలం లో ఈ మార్గంలో వాహనదారులు, ప్రయాణికులు, స్థానికులు పలు కష్టాలు పడుతున్నా ప్రజాప్రతినిధులు తెలిసిన తెలియనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైన కూటమి ప్రభుత్వం, జిల్లా అధికారులు చర్యలు తీసుకొని కుషావతిపై త్వరలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరారు.

Updated Date - Nov 02 , 2024 | 11:40 PM