Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

ABN , Publish Date - Mar 02 , 2024 | 11:00 PM

రానున్న ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును గెలిపిస్తేనే రాష్ట్రం అన్ని విధాల అబివృద్ది చెందుతుందని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జ్‌ భూపేశ్‌రెడ్డి అన్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
ప్రొద్దుటూరు: అమృతనగర్‌లో ప్రచారం చేస్తున్న ప్రవీణ్‌రెడ్డి

మైౖలవరం, మార్చి 2: రానున్న ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును గెలిపిస్తేనే రాష్ట్రం అన్ని విధాల అబివృద్ది చెందుతుందని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జ్‌ భూపేశ్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని వేపరాల గ్రామంలో బాబు ఘ్యారిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ టీడీపీ మేనిఫె స్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేత కార్మికులను అన్ని విదాల ఆదుకుంటామన్నారు. అర్హులందరికీ సంక్షే మ పథకాలు అందాలంటే టీడీపీ ప్రభుత్వం రావా లన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శివ నాధరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమ ణారెడ్డి, మాజీ సర్పంచ్‌ కొండయ్య, నాయకులు రంగనాయకులు, నరసింహారెడ్డి, పాములేటి, నారా యణ, బాస్కర్‌, రామయ్య, కొండారెడ్డి, సుబ్బరా యు డు, కిరణ్‌రాయల్‌, వెంకటేష్‌, ఉపేంద్ర, మునిశేఖర్‌, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రొద్దుటూరు: వైసీపీ దౌర్జన్యాలను టీడీపీ సమర్థ వంతంగా ఎదుర్కొం టుందని, రాబోయే ఎన్నికల్లో వారిని ఓడించి, వారి అక్రమాలు అవి నీతిపై విచారణ జరిపి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపుతా మని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. శనివారం కొత్తపల్లె పంచాయతీ అమృత నగర్‌లో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ అబ్జర్వర్‌ ఏవీ ప్రసాద్‌ , మండల కన్వీనర్‌ బాబుల్‌ రెడ్డి, కడప పార్లమెంటు కార్యదర్శి ఆవుల దస్తగిరి ఆర్‌ఎంపీ ప్రసాద్‌, పాల సుబ్బరాయుడు, రమణా రెడ్డి, మారుతీ , బొమ్మిశెట్టి చిన్న పొట్టి పాటి గంగాధర్‌ పాల్గొన్నారు.

కలసపాడు : క రాజుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజుపాలెం, మల్లువారిపల్లె గ్రామాల్లో నియోజకవర్గ ఎస్సీ సెల్‌ బాధ్యుడు ఎంబడి కిరణ్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు అం దించి టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ తీసివేసి ఎస్సీలకు తీరని అన్యాయం చేసిన ప్రస్తుత ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాలయ్య, మాజీ సర్పంచ్‌ జార్జి, జిల్లా ఎస్సీ సెల్‌ కార్యదర్శి సత్యం, మండల ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి జోజి, మంలడ ఎస్సీ సెల్‌ సలహదారులు జేమ్స్‌, గ్రామస్తు లు కాంతారావు, యేషయా, కిట్టయ్య, జకరయ్య పాల్గొన్నారు.

రాజుపాలెం : మండల పరిఽధిలోని వెల్లాల గ్రామంలో శనివారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సతీమణి మౌనికారెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి సైకిలు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాశినాయన: ఇటుకులపాడు గ్రామంలో బద్వేల్‌ టీడీపీ ఇంచార్జి బొజ్జా రోశన్న జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు బంగారు గుర్విరెడ్డ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు ఎం.రాజారెడ్డి బాబు ష్యూరిటీ .. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో టీడీపీ అధి కారంలోకి వస్తే అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సైకిల్‌ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వారు కోరారు. తెలుగు యువత అధ్యక్షుడు రవీంద్రారెడ్డ్డి, విజయ్‌ కుమార్‌రెడ్డి, డి.క్రిష్ణారెడ్డ్డి, హోండా రవీంద్రారెడ్డి, అక్కిరమణారెడ్డి, ఓ.రోహిత్‌రెడ్డి, అడవి రాముడు, రామసుబ్బారెడ్డి, బూసి వెంకట సుబ్బయ్య, వెంగళరావు, మల్లయ్య, వల్లంపీరయ్య, ఉస్సేన్‌పీరా, పిచ్చయ్య, ఎక్కంటి నాయుడు, రవి శంకర్‌, గురయ్య, ఏసయ్య, తిరుపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2024 | 11:00 PM