ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పల్లె పండుగతో గ్రామాలకు పూర్వ వైభవం

ABN, Publish Date - Oct 15 , 2024 | 11:24 PM

పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

సంబేపల్లెలో సిమెంటు రోడ్డుకు భూమిపూజ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

సంబేపల్లె, అక్టోబరు15(ఆంధ్రజ్యోతి): పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని నారాయణరెడ్డిపల్లెలో సీకేరోడ్డు నుంచి కేజీబీవీ జూనియర్‌ కాలేజ్‌ వరకు దేపపట్ల గ్రామంలోని సీకే రోడ్డు నుండి దేవపట్లమ్మ ఆలయం వరక్ను సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా గ్రామాల్లో తాగు నీరు, విద్యుత, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. శంకుస్థాపన చేసిన పనులన్నింటినీ సంక్రాంతి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. రాబో యే రోజుల్లో ప్రతి గ్రామానికి మౌలిక వసతులు క ల్పించి అభివృద్ధి చేస్తామన్నారు. మండల కేంద్రం లో ని అంబేద్కర్‌కాలనీలో మంత్రి బోరును ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియో జకవర్గంలోని రాయచోటి, సంబేపల్లె, గాలివీడు, లక్కి రెడ్డిపల్లె, రామాపురం, చిన్నమండెం మండలాల్లో నీటి సమస్య పరిష్కారమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటు న్నామన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటేశ, ఎంపీడీవో నరసింహులు, ఈ వోపీఆర్‌డీ సునీల్‌ కు మార్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మల్లు నరసారెడ్డి, మాజీ సర్పంచులు శశిధర్‌రెడ్డి, గోపాల్‌, టీడీపీ నాయకులు కోటేశ్వర్‌రెడ్డి, మల్లు విష్ణువర్ధనరెడ్డి, గోపాల్‌, నూరెకరాల రంగారెడ్డి, వేణుగోపాల్‌ నాయు డు, భయ్యారెడ్డి, యువగళం సిద్దారెడ్డి, ఖాదర్‌బాషా, సుబ్బరాజుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

చిన్నమండెం: చిన్నమండెం మండలం వండాడి, గొర్లముదివేడు క్రాస్‌ తూర్పుపల్లి రోడ్డులో అలాగే కొత్తపల్లి శ్రీరామ్‌నగర్‌కాలనీ సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. బోరెడ్డిగారిపల్లెలోని తమ నివాసంలో ప్రజా దర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు.

రైల్వేకోడూరు(రూరల్‌): పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా మంగళవారం రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ రూ. 29 లక్షలఅంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న సిమెంటు రోడ్ల పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రధానదారి నుంచి సరైన రోడ్డు సదు పాయం లేక మండలంలోని వెంకటరెడ్డిపల్లి ఆరుంఽఽ దతివాడ, వీపీఆర్‌ కండ్రిగ వాసులు నరకయాతన పడేవారన్నారు. కూటమి అధికారం లోకి రాగానే ఈ పంచాయతీలను అభివృద్ధి పథంలోకి తీసుకురావాల ని కంకణం కట్టుకున్నామని తెలిపారు. అధికారులు బాలనరసింహులు,ఉమామహేశ్వర్‌రావు, ఉమా మ హేశ్వర్‌ రెడ్డి, టీడీపీ నాయకులు మద్దిన గిరి నాయు డు, సుబ్రహ్మణ్యం రాజు (ఎనఎస్‌ఆర్‌), ధనంజయరాజు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఓబులవారిపలె: మండలంలోని పున్నాటివారిపల్లె, అరుంఽధతివాడ, జె.వడ్డిపల్లె, జీవీపురం, నూకనా పల్లెలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఎంపీడీవో మల్‌రెడ్డి, ఈవోపీఆర్డీ రామ్మోహనరెడ్డి, ఏఈ ఆంజనేయప్రసాద్‌, ఏపీవోపీ ఎస్‌.భారతి, ఎంపీటీసీ సభ్యురాలు సుజాత, టీడీపీ సీనియర్‌ నాయకులు పున్నాటి వాసుదేవరెడ్డి, బీజేపీ నాయకులు రాజగోపాల్‌రెడ్డి, గోవర్దనరెడ్డి, మాజీ స ర్పంచ అడపాల బాలాజీ, జీవీపురం టీడీపీ నాయ కులు వెంకటయ్య, జీవీ సుబ్బరాయుడు, పల్లా నారాయణ, భరతరెడ్డి, నాగేంద్ర, చంద్ర, పీరయ్య, అన్నెపు మహేష్‌, పొలసాని కిరణ్‌ పాల్గొన్నారు.

పుల్లంపేట: పల్లె పండుగలో భాగంగా రంగంపల్లె పంచాయతీ ఆర్‌.గొల్లపల్లెలో సచివాలయం, అరుంఽ దతివాడకు వెళ్లే మార్గాల్లో సిమెంట్‌ రోడ్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం గ్రామస్థుల నుంచి పలు సమ స్యలపై వినతిపత్రాలు అందుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రంగంపల్లె పంచాయతీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకు లు రమణ, టీడీపీ నాయకులు మల్లి తదితరులు పాల్గొన్నారు.

సిమెంటు రోడ్ల నిర్మాణాలతోనే పల్లె ప్రగతి

గాలివీడు: సిమెంటు రోడ్ల నిర్మాణంతోనే పల్లెలు ప్రగతి పథంలో నడుస్తాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సోదరుడు డాక్టర్‌ లక్ష్మిప్రసాద్‌రెడ్డి తెలిపారు. పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని ఎగువగొట్టివీడు, పేరం పల్లి, గరుగుపల్లి పంచాయతీల్లో సిమెంటు రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ప్ర జలకు ఇచ్చిన హామీ మేరకు సిమెంటు రోడ్ల నిర్మా ణంతో పాటు తాగునీటి సమస్యను పరిష్కరించ డానికి ప్రతి గ్రామంలో మంచినీటి బోర్లను వేస్తు న్నట్లు తెలిపారు. ప్రస్తుతం రెండు కోట్లతో సిమెంటు రోడ్ల పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకట నారాయణరెడ్డి, మాజీ సర్పంచ ప్రభాకర్‌నాయుడు, టీడీపీ నాయకు లు గీతల ధర్మారెడ్డి, ఉదయ్‌కుమార్‌, నాగేశ్వర్‌, మల్లికార్జున, వెంకట్రమణారెడ్డి, కుమార్‌రెడ్డి, శేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 11:24 PM