పెంచిన విద్యుత చార్జీలను వెంటనే తగ్గించాలి
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:15 AM
సర్దుబాటు చార్జీల పేరు తో పెరిగిన విద్యుత చార్జీలను తగ్గించాలని డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి డిమాండ్ చేశారు.
డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి
కడప ఎన్టీఆర్ సర్కిల్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): సర్దుబాటు చార్జీల పేరు తో పెరిగిన విద్యుత చార్జీలను తగ్గించాలని డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడపలోని పార్టీ కార్యాలయం నుంచి మహవీర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యుత భవన వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెరిగిన కరెంటు చార్జీలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్నా రు. వైసీపీ హయాంలో రూ.35వేల కోట్లు సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజల నుంచి వ సూలు చేశారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఐదు నెలల్లోనే రూ.17వేల కోట్ల భారం మోపుతోందన్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో యూనిట్ ధర రూ.4.80 పైసలు ఉంటే ఏపీలో మాత్రం రూ.6 వసూలు చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఏకంగా సర్దుబాటు చార్జీల పేరుతో 40 శాతం అధికంగా వసూలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అప్జల్‌ఖాన, పులివెందుల నియోజకవర్గం సమన్వయకర్త ధ్రువకుమార్‌రెడ్డి, ప్రొదుద్దుటూరు నియోజకవర్గం సమన్వయకర్త ఇర్షానబాషా, జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త శివమోహనరెడ్డి, మైదుకూరు నియోజకవర్గ సమన్వయకర్త సుధాకర్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలీఖాన, పీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు బండి జకరయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాగ్రెస్ పార్టీ నాయకులు సలాఉద్దీన, యూత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండి సుమంత, యూత కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుశీల్‌కుమార్, గౌస్‌పీర్, సిరాజుద్దీన తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 12:15 AM