ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అన్నదాత అభివృద్ధే టీడీపీ ధ్యేయం

ABN, Publish Date - Nov 05 , 2024 | 11:40 PM

నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న పుత్తా నరసింహారెడ్డి

ప్రతి ఎకరాకు సాగునీరు ఫ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి

కమలాపురం రూరల్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం కమలాపురం మండలం చదిపిరాళ్ల చెరువు నిండటంతో అధికారులతో కలిసి దిగువ కాల్వకు నీరు వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరువు జాబితాలో మన జిల్లాను కూడా చేర్చాలని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం కూడా అందించాలని కోరామన్నారు. అనంతరం శివాలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాసులు, మల్లిఖార్జునరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దారు శివరామిరెడ్డి, టీడీపీ నాయకులు వాసుదేవరెడ్డి, ఖాదర్‌బాషా, రాఘవరెడ్డి, కంకర సుబ్బారెడ్డి, రఘురాంరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, టీఎనటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మల్లేశ, రాయల్‌ దివాకరరెడ్డి, మస్తానయ్య, రాజారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ హర్షం: క్రిష్ణా జలాలతో చదిపిరాళ్ల చెరువును నింపడం హర్షణీయమని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఆ చెరువును సీపీఐ బృందం పరిశీలించారు. ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని అభినందించారు.

Updated Date - Nov 05 , 2024 | 11:40 PM